
ఈ సినిమాలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ లేరు. పైగా ప్రజెంట్ ట్రెండ్ అయిన వీఎఫ్ ఎక్స్ గ్రాఫిక్సులు, యాక్షన్ సీక్వెన్సులు లేవు. స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఏమీ లేవు. పైగా భారీ బడ్జెట్ సినిమా కూడా కాదాయే. జస్ట్ రూ. 7 కోట్లతో మాత్రమే సినిమా తీశారు. కానీ కేవలం కంటెంట్ తోనే ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. చిన్న సినిమాగా రిలీజైనా రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. హారర్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఈ మూవీ పేరు అబ్సెషన్ (Obsession). కొన్ని రోజుల క్రితం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపించింది. మే 15న విడుదలైన అబ్సెషన్ వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇండియాలోనూ రికార్డు వసూళ్లు సాధించింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా రూ. 2500 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఒక్క ఇండియాలోనే రూ. 77 కోట్లు రాబట్టడం విశేషం. ఇలా బాక్సాఫీస్ ను గడగడలాడించిన అబ్సెషన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
కాగా అబ్సెషన్ సినిమా ఇప్పటికే విదేశాల్లో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఇండియాలో మాత్రం స్ట్రీమింగ్ కు రాలేదు. అయితే ఎట్టకేలకు ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఇండియన్ ఆడియెన్స్ కు కూడా అందుబాటులోకి రానుంది. ‘అబ్సెషన్: ది ఒరిజినల్ అన్కట్ వెర్షన్’ జియో హాట్స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 30వ తేదీన సాయంత్రం 7 గంటల నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్తో పాటు హిందీ భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. కాగా సరిగ్గా హాలోవీన్ సీజన్కు ముందు అబ్సెషన్ సినిమాను విడుదల చేయడం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. కర్రీ బార్కర్ తెరకెకక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో మైఖేల్ జాన్స్టన్ ,ఇండీ నవరెట్టే ప్రధాన పాత్రలు పోషించారు. తన బెస్ట్ ఫ్రెండ్ను ప్రేమలో పడేయాలనే ఒక యువకుడి ఆరాటం ఎలాంటి భయానక పరిణామాలకు దారితీసింది అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి అబ్సెషన్ ది బెస్ట్ అని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.