
గత వారం థియేటర్లలో రిలీజైన ఆకాశంలో ఒకతార, ఈఎన్ఈ రిపీట్ సినిమాలు సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్నాయి. అలా ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్కు రెడీ అయిపోయాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న శర్వానంద్- సంపత్ నందిల సినిమా భోగి ఈ వారమే ఆడియన్స్ను అలరించేందుకు వచ్చేస్తోంది. ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు హే కన్నమ్మ, హై, డేంజర్ బాయ్స్, ది మేజ్, పూలే లాంటి చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో బోలెడ్ చిత్రాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. ఈ వీక్లో ప్రధానంగా అజయ్ దేవగణ్ దృశ్యం-3 ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. హిందీలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన హనుమాన్ అంశ్ కూడా ఈ వారంలోనే ఓటీటీకి రానుంది. ఈ రెండు సినిమాలతో పాటు వెంకీ ఆదర్శకుటుంబం కూడా స్ట్రీమింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి నవంబర్ ఆఖరి వారంలో ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
సోని లివ్
జియోహాట్స్టార్
ఆపిల్ టీవీ ప్లస్
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.