Pushpa: ఇట్స్ అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన మేకర్స్..

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన

Pushpa: ఇట్స్ అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన మేకర్స్..

Updated on: Jan 05, 2022 | 12:42 PM

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ధ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ అతి తక్కువ సమయంలోనే 300 కోట్ల ట్రేడ్ మార్క్‏ను దాటేసి విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్.. నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా పుష్ప చిత్రయూనిట్ ఆడియన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల7న పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

ప్రస్తుతం సినీ పరిశ్రమపై మరోసారి ఓమిక్రాన్ దెబ్బ పడింది. సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలకు ఓమిక్రాన్, కరోనా గట్టిగానే దెబ్బతీసింది. దీంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి జనవరి 7న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. దీంతో ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్న మెగా, నందమూరి అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సిన తేదీనే పుష్ప సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా నెట్టింట్లో టాక్ నడుస్తోంది. ఇక ఇదే వార్తలను నిజమంటూ పుష్ప ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.

Also Read: Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..

Anupama Parameswaran: లవ్ బ్రేకప్ గురించి హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. కానీ.. ప్రేమను గుర్తుచేసుకోనంటూ..

 Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి

RGV On AP Govt. సినిమా టికెట్స్ వ్యవహారం.. ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలను సంధించిన రామ్ గోపాల్ వర్మ ..

 

Loading...
Unable to load recommendations.
Follow Us