
ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రతి క్షణం ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలతో సాగిపోయే చిత్రాలు చూడాలనుకునేవారికి ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ సిరీస్ పేరు టస్కరీ. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఇప్పుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లి్క్స్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ దూసుకుపోతుంది. ఓటీటీలో విడుదలైన వెంటనే ఇది నంబర్ వన్ ట్రెండింగ్‌లో నిలిచింది. కిడ్నాప్ మాఫియా, పోలీసుల దర్యాప్తు, రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ భావాలు, ఊహించని మలుపులతో, ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను కథలోకి లాగేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
ఈ సిరీస్ కథ అక్రమ రవాణా చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. దేశ సరిహద్దులను దాటి విస్తరించి ఉన్న ఒక భారీ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఛేదించడానికి రంగంలోకి దిగిన ఒక నిజాయితీపరుడైన అధికారి ప్రయాణమే ఈ కథ ప్రధాన అంశం. ఈ అక్రమ రవాణా మాఫియా, దాని వెనుక ఉన్న పలుకుబడిగల వ్యక్తులు, కథలోని మలుపులే ఈ సిరీస్‌ను వేగంగా ముందుకు నడిపిస్తాయి. ప్రతి ఎపిసోడ్ ఒక మలుపుతో ముగుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్సుకతను పెంచుతూ, ప్రేక్షకులు చివరి వరకు చూడాలని కోరుకునేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. యాక్షన్ తో నిండిన పోరాట సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథనం, భావోద్వేగభరితమైన కుటుంబ సన్నివేశాలతో ఈ సిరీస్ బలంగా ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించారు. తన అద్భుతమైన నటనతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అదేవిధంగా, విలన్‌గా నటించిన శరద్ కూడా దృష్టిని ఆకర్షిస్తారు. ఈ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి, ఒక్కో ఎపిసోడ్ 40-50 నిమిషాల నిడివి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సిరీస్‌ను చూడొచ్చు.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..