96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 11) ఉదయం ఈ అవార్డుల పండగ ప్రారంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ ఈవెంట్ జరుగుతోంది. జిమ్మీ కిమ్మెల్ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్కార్ వేడుకల్లో ప్రతిసారీ ఏదో ఒక విషయంపై రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాగే జరిగింది. దీనికి కారణం WWE స్టార్ రెజ్లర్ జాన్ సీనా. అతనికి కుస్తీ పోటీలతో పాటు నటనలోనూ అనుభవం ఉంది. ఈ కారణంగానే ఇప్పుడు ఆస్కార్ వేదిక ఎక్కి వార్తల్లో నిలిచాడీ మల్ల యోధుడు. సాధారణంగా ఇలాంటి ఈవెంట్‌కి వస్తే స్టైలిష్ దుస్తుల్లో తళుక్కుమంటారు. ఇందు కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తారు. కానీ జాన్ సీనా మాత్రం నగ్నంగా బట్టల్లేకుండా వచ్చాడు. అయితే దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈసారి అస్కార్ వేడుకల్లో బెస్ట్ బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ఇచ్చే అవకాశం జాన్ సీనాకు దక్కింది. ఈ అవార్డును ప్రజెంట్ చేయడానికి అతని పేరు అనౌన్స్ చేశారు ఆస్కార్ నిర్వాహకులు. ఇక్కడే అందరికీ షాక్ ఇచ్చాడీ స్టార్ రెజ్లర్.
అసలు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఆస్కార్ వేదికపైకి వచ్చిన జాన్ సీనాను చూసి అందరూ నోరెళ్లబెట్టారు. తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా మాత్రం అడ్డుగా విజేత పేరు ఉన్న కార్డు పెట్టుకొని ఆస్కార్ స్టేజ్ పైకి వచ్చాడు. సినిమాల్లో కాస్టూమ్ డిజైనర్ ఎంత అవసరమో తెలిపేందుకే జాన్ సీనా ఇలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. అయితే ఆస్కార్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ సలహాతోనే జాన్ సీనా ఇలా దుస్తుల్లేకుండా వచ్చాడని తెలుస్తోంది. ఇక ‘పూర్ థింగ్స్’ చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు వచ్చింది. అలాగే ఓపెన్ హైమర్ సినిమాకు అవార్డుల పంట పండింది. గతేడాది భారత్‌కు ఆస్కార్ చాలా ప్రత్యేకం. భారతీయ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. అదే విధంగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కూడా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.
#JohnCena presented the #Oscar for Best Costume Design NAKED 😂🥵 https://t.co/r7WoNDVle4 (🎥: ABC) pic.twitter.com/BO4coRLTFA
— TMZ (@TMZ) March 11, 2024
Watch 96th The Oscars Award 2024 Live For Free Streams Here
🔗WATCH LIVE📺 https://t.co/BLQRUbihFR
Oscar Awards Stream ⬇️#Oscars #Oscar #Oscars2024 #第96回アカデミー賞 #academyawardspic.twitter.com/Xbedpl7i6F .gg
— JP_TV2024 (@JP_TV_24) March 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.