
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా లెనిన్. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్య దేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై ఆసక్తికని క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా చిత్రయూనిట్ తోపాటు .. అక్కినేని నాగార్జున సైతం ప్రెస్ మీట్ లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ అఖిల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈసారి లెనిన్ సినిమాతో అఖిల్ హిట్టు కొడుతున్నాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..
నాగార్జున మాట్లాడుతూ.. “కొడుకు ఏదైనా చేస్తే అది తండ్రికి ఎంత ముఖ్యమో.. ఈ సినిమా ఇప్పుడు నాకు అంతే ముఖ్యం. ఏ తండ్రి అయినా బిడ్డ బాగుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ బిడ్డకు సక్సెస్ వచ్చినప్పుడు అదే సంతోషం ఉంటుంది. ఇప్పటివరకు నేను ఇంతగా ఇన్వాల్వ్ అయి చేసిన సినిమా మనం. అది కేవలం మా నాన్న గారి కోసమే చేశాను. ఆయన నా తండ్రి. అఖిల్ నా బిడ్డ. అందుకే ఇప్పుడు అఖిల్ కోసం ఇంత ఇన్వాల్వ్ అయి చేస్తున్నాను. ఏదో సెట్స్ కు వెళ్లి చూసుకోకుండా.. స్టోరీ దగ్గరి నుంచి అన్నింట్లో ఇన్వాల్వ్ అయ్యను. మ్యూజిక్ గురించి తమన్ తో మాట్లాడేవాడిని… సినిమా గురించి ఎప్పటికప్పుడు మాట్లాడేవాడిని.. అలాగే సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని దగ్గరుండి తెలుసుకున్నాను. తండ్రిగా కొడుకు కోసం ఏం చేయాలో అది చేశాను అంతే” అంటూ చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..
మనం సినిమాలాగే లెనిన్ కూడా అంత పెద్ద హిట్టవుతుందా లేదా అనేది నా చేతుల్లో లేదు. కేవలం తండ్రిగా నా బాధ్యత ఏం చేయాలో అది చేశానని అనారు. లెనిన్ క్యారెక్టర్ ను అడియన్స్ గుండెల్లో పెట్టుకుంటే తప్పకుండా సినిమా హిట్టవుతుందని అన్నారు. లెనిన్ ఒక ఎమోషనల్ జర్నీ, అఖిల్ లో ఒక పెయిన్ ఉంది. అది ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ అంత పెయిన్ ఉంది అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?
ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..