love Story Movie: చిరు సినిమా డేట్ పై కన్నెేసిన నాగచైతన్య.. ‘లవ్ స్టోరీ’ విడుదల ఆరోజునే..

Love Story Movie: అక్కినేని నాగచైతన్య.. సాయిపల్లవి జంటగా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా 'లవ్ స్టోరీ'..

love Story Movie: చిరు సినిమా డేట్ పై కన్నెేసిన నాగచైతన్య.. లవ్ స్టోరీ విడుదల ఆరోజునే..
Love Story Cinema

Updated on: Apr 16, 2021 | 7:08 PM

Love Story Movie: అక్కినేని నాగచైతన్య.. సాయిపల్లవి జంటగా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘లవ్ స్టోరీ’.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇందులోని సాంగ్స్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది. కానీ తెలుగులో రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుండడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత లవ్ స్టోరీ విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు డైరెక్టర్. అయితే తాజాగా ఈ మూవీ రీలిజ్ డేట్‏కు సంబంధించిన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

లవ్ స్టోరీ సినిమాలో మే 13న విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే అదే రోజున కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్యను విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో లవ్ స్టోరీ చిత్రాన్ని ఆచార్య సినిమా డేట్ కి విడుదల చేయాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అందులో నాని టక్ జగదీష్, రానా విరాటపర్వం, బాలీవుడ్ క్వీన్ కంగన నటించిన ‘తలైవి’ చిత్రాలు వెనకడుగు వేసాయి.

ఇక దేశ వ్యాప్తంగా కరోనా మరోసారి పంజా విసురుతుంది. గతంతో పోలిస్తే.. ఈసారి సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తోంది. దీంతో 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు స్వయం లాక్ డౌన్ విధించుకుంటుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్నాయి.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‏కు కొవిడ్ పాజిటివ్.. కొనసాగుతున్న చికిత్స.. అధికారికంగా ప్రకటించిన జనసేన టీం..

సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో బేబమ్మకు ఆఫర్ల వెల్లువ.. తమిళ స్టార్ హీరోకు జోడీగా కృతి శెట్టి..

చేతులు జోడించి క్షమాపణలు చేబుతున్నా.. ఏ మనిషిని నొప్పించాలనుకోలేదు.. తనికెళ్ల భరణి..

Loading...
Unable to load recommendations.
Follow Us