Indian Idol: జీవి ప్రకాశ్‌నే మెప్పించిన అయన్‌ ప్రణతి.. ఆహా ఇండియన్‌ ఐడల్‌ వేదికపై మాష్టారు పాటతో.

ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఇండియన్‌ ఐడల్‌ రోజురోజుకీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో దూసుకుపోతోంది. అద్భుతమైన టాలెంట్ ఉండి.. నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ ఫామ్ కోసం ఎదురుచూసే యువ గాయనీగాయకులకు...

Indian Idol: జీవి ప్రకాశ్‌నే మెప్పించిన అయన్‌ ప్రణతి.. ఆహా ఇండియన్‌ ఐడల్‌ వేదికపై మాష్టారు పాటతో.
Aha Indian Idol

Updated on: Apr 03, 2023 | 3:25 PM

ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఇండియన్‌ ఐడల్‌ రోజురోజుకీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో దూసుకుపోతోంది. అద్భుతమైన టాలెంట్ ఉండి.. నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ ఫామ్ కోసం ఎదురుచూసే యువ గాయనీగాయకులకు మంచి ఛాన్స్ ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికితీస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇప్పటికే తొలి సీజన్‌ విజయం అందుకోగా ఇప్పుడు రెండో సీజన్‌కు కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది ట్యాలెంట్‌ ప్రపంచానికి పరిచయం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో యంగ్‌ సింగర్‌ సెన్సేషన్‌ ప్రపంచానికి పరిచయం అయ్యింది.

ఆ గాన కోకిలే 14 ఏళ్ల అయన్‌ ప్రణతి. అయ్యన్ ప్రణతికి రోజురోజూకూ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఆమె పాడిన సార్ చిత్రంలోని ‘మాష్టారు..మాష్టారు’ పాటతో తెలుగువారందరకీ బాగా చేరువయ్యింది. అయ్యన్‌ ప్రణతి ట్యాలెంట్‌కు సామాన్య ప్రేక్షకులతో పాటు ఏకంగా సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. మాష్టారు మాష్టారు పాట కంపోజ్ చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ప్రణతిని ప్రత్యేకంగా అభినందించారు.

ఇవి కూడా చదవండి

తాజాగా జీవీ ప్రకాష్‌ అయన్‌పై ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో గాయనిగా ఆమె అద్భుతంగా రాణిస్తుందని జడ్జెస్ సైతం కితాబిస్తున్నారు. ఇదిలా ఉంటే అయ్యన్ ప్రణతి తండ్రి కూడా సంగీతకారుడు కావడం విశేషం. ఇండియన్ ఐడల్ స్టేజ్ పై ఆయన ప్రదర్శన చూసి షో జడ్జ్, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పడం హైలెట్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us