
తెలుగు జానపద సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మాధురి రాథోడ్ మరోసారి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తుంది. కొద్దికాలం పాటు పర్సనల్ విషయాలతో సాంగ్స్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె, తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కొత్త జానపద గీతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ఈ సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పుడు ఈ పాట ఫోక్ సాంగ్స్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ పాటతో మాధురి అదిరిపోయే సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. అదే భామా సుందరాలో పూర్తి స్థాయి ఫోక్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వెంకట్ అజ్మీరా అందించిన మ్యూజిక్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా సాగే ఈ పాటలో మాధురి రాథోడ్ తన అద్భుతమైన గాత్రంతో మరోసారి మ్యాజిక్ చేశారు. ఆమె డ్యాన్స్ లో ఉన్న మాస్ ఎనర్జీ, ఫోక్ బీట్స్ శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తున్నాయి.
ఈ పాటకు శ్రోతల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఆడియన్స్ ఈ సాంగ్‌ను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్‌లో నిలిచింది. పాటలోని సాహిత్యంతో పాటు లయబద్ధమైన సంగీతం ప్రేక్షకులను డ్యాన్స్ చేసేలా ఉత్సాహపరుస్తోంది. మాధురి రాథోడ్ ఎనర్జిటిక్ వాయిస్ అండ్ పెర్ఫార్మెన్స్ ఈ పాటకు మరింత బలాన్నిచ్చాయి. సోషల్ మీడియా రీల్స్ , షార్ట్స్‌లోనూ ఈ పాటే ప్రస్తుతం మార్మోగుతుండటం విశేషం.
ఈ పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే యూట్యూబ్‌లో అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంటూ దాదాపు 4.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి దూసుకుపోతోంది. ఈ పాటను విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మీరు వినేయండి..
ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..