నటిపై అత్యాచారం కేసులో ట్విస్ట్.. మరో మహిళ ఆరోపణలతో మలయాళీ నటుడిపై రెండో కేసు నమోదు..

పోలీసులు ఈ ఘటనలో ఇప్పటికే ఈ మలయాళ నటుడిపై కేసు నమోదు చేయగా, సోషల్ మీడియాలో సదరు మహిళ వివరాలు బయటపెట్టినందుకుగాను మరో కేసు నమోదు చేశారు.

నటిపై అత్యాచారం కేసులో ట్విస్ట్.. మరో మహిళ ఆరోపణలతో మలయాళీ నటుడిపై రెండో కేసు నమోదు..
Malyalam Actor Vijay Babu

Updated on: Apr 30, 2022 | 12:10 AM

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన వార్త అందరినీ షాక్‌కి గురి చేసింది. నటుడు, నిర్మాత విజయ్ బాబుపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. అలాగే అత్యాచారం చేశాడంటూ కేసు నమోదు చేసింది. తనకు పని ఇప్పిస్తాననే సాకుతో తనపై ఎన్నోసార్లు లైంగిక దాడులు చేశాడని ఆరోపించింది. ఈ మేరకు విజయ్ బాబుపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయ్ బాబు కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. తనను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం జరుగుతోందని నటుడి తరుపున చెప్పుకొచ్చారు. ఈలోగా విజయ్ బాబుకు కష్టాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మరో మహిళ అతనిపై దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపించింది. విమెన్ ఎగైనెస్ట్ సెక్సువల్ వేధింపుల ఫేస్‌బుక్ పేజీలో శుక్రవారం ఓ మహిళ ఈ ఆరోపణ చేసింది. విజయ్ బాబు ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించిన సమయంలో ఆ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆ మహిళ తన ఫేస్‌బుక్ పేజీలో ‘ నేను నవంబర్ 2021 శుక్రవారంనాడు నటుడు, నిర్మాత విజయ్ బాబుని కలిశాను. పని విషయంలో కలిశాం. వృత్తిపరంగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. తర్వాత వ్యక్తిగత సమస్యలు వచ్చాయి. నాకు సహాయం అవసరమని అతను గ్రహించాడు. నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. మాతో పాటు ఉన్న మరో స్నేహితుడు గది నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు మేం ఇద్దరం మాత్రమే ఉన్నాం. అతను తాగుతున్నాడు. నాకు కూడా ఇచ్చాడు. నేను తిరస్కరించాను. అకస్మాత్తుగా అతను నన్ను ముద్దు పెట్టుకున్నాడు. నేను వెనక్కి తగ్గాను. దూరం ఉంచాను. నేను అతని ముఖంలోకి చూశాను. అప్పుడు అతను క్షమాపణ చెప్పడం ప్రారంభించాడు. ఎవరికీ చెప్పవద్దని వేడుకున్నాడు. నేను భయపడి అంగీకరించాను. నేను వెంటనే గది నుంచి బయటకువచ్చాను’ అంటూ చెప్పుకొచ్చింది.

కాగా, మహిళ చేసిన ఆరోపణలను నటుడు విజయ్‌ బాబు ఫేస్‌బుక్‌ లైవ్‌‌లో మంగళవారం ఖండించాడు. ఆ నటి నాకు 5ఏళ్లుగా తెలుసని, ఈ విషయంలో నేనే బాధితుడినని, ఆమెపై పరువునష్టం దావా వేస్తానని పేర్కొన్నాడు. పోలీసులు ఈ ఘటనలో ఇప్పటికే ఈ మలయాళ నటుడిపై కేసు నమోదు చేయగా, సోషల్ మీడియాలో సదరు మహిళ వివరాలు బయటపెట్టినందుకుగాను మరో కేసు నమోదు చేశారు.

ఈమేరకు విజయ్‌ బాబుపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఆయన దేశం విడిచి పరారయ్యాడని అనుమానిస్తున్నట్లు వారు తెలిపారు. ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Amul-KGF2: బైక్‌పై స్వాగ్‌ చూపిస్తూ యష్‌ .. సినిమా సక్సెస్‌పై ‘అముల్‌’ పోస్టర్‌ వైరల్..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కారు వారి పాట ఎడిటర్..

Loading...
Unable to load recommendations.
Follow Us