AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: బాలయ్య టాక్ షోలో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్.! మరెన్నో ఆసక్తికర విషయాలు..

ఒకవైపు గాడ్ ఆఫ్ మాసెస్, మరోవైపు బాహుబలి.. ఈ కాంబినేషనే అదుర్స్ కదూ.. ఈ ఇద్దరూ బుల్లితెరపై కనిపిస్తే.. టీఆర్పీలు బ్లాక్‌బస్టరే.

Prabhas: బాలయ్య టాక్ షోలో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్.! మరెన్నో ఆసక్తికర విషయాలు..
Prabhas
Ravi Kiran
|

Updated on: Dec 14, 2022 | 6:43 AM

Share

ఒకవైపు గాడ్ ఆఫ్ మాసెస్, మరోవైపు బాహుబలి.. ఈ కాంబినేషనే అదుర్స్ కదూ.. ఈ ఇద్దరూ బుల్లితెరపై కనిపిస్తే.. టీఆర్పీలు బ్లాక్‌బస్టరే. మరి వారెవరో కాదు మన డార్లింగ్ ప్రభాస్, బాలకృష్ణ. వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించారు. అదేనండీ.. బాలయ్య టాక్ షోలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తన క్లోజ్‌ ఫ్రెండ్‌ మ్యాచో స్టార్‌ గోపిచంద్‌తో కలిసి పాల్గొన్నాడు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూట్ కూడా జరిగింది. ఇక బాహుబలి ఫ్యాన్స్ అంతా ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షోలో పలు ప్రశ్నలకు ప్రభాస్ నుంచి ఆసక్తికర సమాధానాలు వచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఈ షో వేదికగానే తన పెళ్లిపై కూడా ప్రభాస్ క్లారిటీ ఇచ్చారని సమాచారం. తన షోకు వచ్చిన యంగ్ సెలబ్రిటీలందర్నీ తికమక పెట్టి మరీ సమాధానాలు రాబడుతున్న బాలయ్య… ప్రభాస్‌‌ను పెళ్లి విషయంలో కూడా అలాగే తికమక పెట్టారట. తికమక పెట్టడమే కాదు.. త్వరగా పెళ్లి చేసుకోవాలని క్లాస్ కూడా పీకారట. ఇక ఆ క్రమంలోనే తన పెళ్లి గురించి ఓ గుడ్‌ న్యూస్ చెప్పారట ఈ హీరో. అటు తనపై వస్తోన్న డేటింగ్ రూమర్స్‌కు కూడా ప్రభాస్ స్పందిస్తాడని తెలుస్తోంది.

దానికితోడు… షోలో ఓ గేమ్‌లో భాగంగా.. రామ్‌ చరణ్‌కు ఫోన్ చేసి మాట్లాడతారు ప్రభాస్‌. అలా మాట్లాడే క్రమంలో.. ప్రభాస్ త్వరలో ఓ గుడ్‌ న్యూస్‌ చెబుతారని.. చెర్రీ బాలయ్యతో అంటారట. ఇక ఇది కూడా మన బాహుబలి హీరో పెళ్లి గురించే అయింటుందని ఇండస్ట్రీలో టాక్. కాని అసలు విషయం ఏంటనేది తెలియాలంటే.. అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌ 6 ప్రోమో వచ్చే వరకు మాత్రం ఆగాల్సిందే! కాగా, ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అటు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే సీజన్‌-2 సక్సెస్‌ ఫుల్‌గా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతోన్న ఈ టాక్‌షో మొదటి సీజన్‌కు మించి ఆదరణ దక్కించుకుంటోంది.

Follow Us
అప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ ..
అప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ ..
కోహ్లీపై కోపంతో టీమిండియా కొంపముంచుతున్న గంభీర్?
కోహ్లీపై కోపంతో టీమిండియా కొంపముంచుతున్న గంభీర్?
కొత్త మెటల్ బాడీ ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్..150 కిమీల మైలేజ్
కొత్త మెటల్ బాడీ ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్..150 కిమీల మైలేజ్
సంవత్సరాల పాటు నిల్వ ఉండే అమ్మమ్మల నాటి పండు మిరపకాయ పచ్చడి
సంవత్సరాల పాటు నిల్వ ఉండే అమ్మమ్మల నాటి పండు మిరపకాయ పచ్చడి
నాణేల బస్తాతో బైక్ షోరూంకు వచ్చాడు.. ఆ తర్వాత...
నాణేల బస్తాతో బైక్ షోరూంకు వచ్చాడు.. ఆ తర్వాత...
దాదా బయోపిక్‌ ‘ఫస్ట్‌ లుక్‌’ అదుర్స్..
దాదా బయోపిక్‌ ‘ఫస్ట్‌ లుక్‌’ అదుర్స్..
శని వక్రగతిలో ఈ కలలు వస్తే అదృష్టం మారుతుందా? స్వప్న శాస్త్రం..
శని వక్రగతిలో ఈ కలలు వస్తే అదృష్టం మారుతుందా? స్వప్న శాస్త్రం..
మీ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్నారా
మీ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్నారా
పేదవాడి పరమాన్నం.. విటమిన్ బి12 లోపానికి చెక్ పెట్టే లక్ష్మీ చారు
పేదవాడి పరమాన్నం.. విటమిన్ బి12 లోపానికి చెక్ పెట్టే లక్ష్మీ చారు
లగేజీ సర్దుకుని వచ్చేయండ్రా అబ్బాయిలు.. ఐపీఎల్ ఆడుకోవచ్చు
లగేజీ సర్దుకుని వచ్చేయండ్రా అబ్బాయిలు.. ఐపీఎల్ ఆడుకోవచ్చు