Krithi Shetty : ‘ఉప్పెన’లా ఎగసిపడుతున్న ఆఫర్లు.. రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌‌‌లో…

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరో గా పరిచయం అవుతున్న సినిమా 'ఉప్పెన'. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు..

Krithi Shetty : ఉప్పెనలా ఎగసిపడుతున్న ఆఫర్లు.. రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌‌‌లో...

Updated on: Jan 31, 2021 | 12:50 PM

Krithi Shetty : మెగాహీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరో గా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి పోస్టర్లు ,లిరికల్ సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ కృతి శెట్టి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

టీజర్ లో లిరికల్ సాంగ్స్ లో కృతి క్యూట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. అలాగే సుధీర్ బాబు నటిస్తున్న ఓ సినిమాలోనూ కృతిని ఎంపిక చేసారని తెలుస్తుంది. మరి కొంతమంది యంగ్ హీరోలు కూడా ఈ హీరోయినే కావాలని అంటున్నారట. దాంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ పెంచేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం ఏకంగా అరకోటికి పైగానే పారితోషికం అందుకుంటుందని ఇండస్ట్రీలో టాక్. ఇక ఉప్పెన సినిమా హిట్ అయ్యి ఆతర్వాత కమిట్ అయినా సినిమాల్లో ఒక్క సినిమా అయినా సక్సెస్ అయితే కృతి కోటిరూపాయలవరకు అందుకున్న అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan : భారీ బడ్జెట్‌‌‌తో రానున్న పవన్- క్రిష్ మూవీ… మొగలాయిల కాలం నాటి కథ నేపథ్యంలో సినిమా..

 

Loading...
Unable to load recommendations.
Follow Us