వంటలక్క అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌

సీరియల్స్‌నందు ‘కార్తీక దీపం’ వేరయా. అవును ఈ సీరియల్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వంటలక్క అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌

Updated on: Aug 10, 2020 | 2:16 PM

Karthika Deepam serial: సీరియల్స్‌నందు ‘కార్తీక దీపం’ వేరయా. అవును ఈ సీరియల్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న సీరియల్‌ ఇది. రాత్రి గం.7.30ని.లు అయ్యిందంటే చాలు..  తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఇళ్లలోని టీవీల్లో కార్తీక దీపం కనిపిస్తుంటుంది. అంతేకాదు స్టార్ హీరోల హిట్టు సినిమాలు కూడా.. టీఆర్పీ రేటింగ్‌లో వంటలక్కతో పోటీపడలేకపోతున్నాయి. ఇంతటి క్రేజ్‌ ఉన్న ఈ సీరియల్‌ అభిమానుల కోసం మరో గుడ్‌న్యూస్ చెప్పారు దర్శకనిర్మాతలు.

మామూలుగా ఈ సీరియల్ నిడివి 30నిమిషాల పాటు ఉండనుండగా.. ఇప్పుడు మరో 15 నిమిషాలకు పెంచారు. ఈ సీరియల్‌తో పాటు దాని తరువాత వచ్చే గృహలక్ష్మి సీరియల్‌ని కూడా మరో 15 నిమిషాలు పెంచారు. మొత్తానికి ఈ రెండు సీరియళ్లు ఇకపై గంటన్నర్రపాటు వినోదాన్ని పంచనున్నాయి. ఏదేమైనా వంటలక్క అభిమానులకు మాత్రం ఇది నిజంగా శుభవార్తనే. ఇదిలా ఉంటే మరోవైపు హిమ తన తోడబుట్టిన చెల్లెలు అని సౌర్యకు తెలియడంతో కార్తీక దీపం మరింత రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే.

Read This Story Also: విద్యాసంస్థలకు 50కి.మీల పరిధిలో వాటి అమ్మకాలు ఉండకూడదు

 

Loading...
Unable to load recommendations.
Follow Us