సీక్రెట్‌గా కాజల్ ఎంగేజ్‌మెంట్‌.. హాజరైన బెల్లంకొండ!

టాలీవుడ్‌ చందమామ కాజల్‌కి సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందా..! ఇప్పుడు ఈ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

సీక్రెట్‌గా కాజల్ ఎంగేజ్‌మెంట్‌.. హాజరైన బెల్లంకొండ!

Updated on: Aug 16, 2020 | 12:40 PM

Kajal Aggarwal engagement: టాలీవుడ్‌ చందమామ కాజల్‌కి సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందా..! ఇప్పుడు ఈ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలే కాజల్‌కి నిశ్చితార్థం అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మీడియాకు తెలియనివ్వకుండా కుటుంబం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం గౌతమ్‌ అనే వ్యక్తితో కాజల్‌కి నిశ్చితార్థం అయ్యిందట.

అంతేకాదు అత్యంత గోప్యంగా జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్‌ నుంచి నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ హాజరయ్యారట. కవచం, సీత సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండగా.. ఈ కార్యక్రమానికి అతడిని మాత్రమే ఆహ్వానించిదట కాజల్‌. మరి ఈ పుకార్లపై కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే కాజల్ పెళ్లి గురించి వార్తలు రావడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ పలుమార్లు కాజల్ పెళ్లి పుకార్లు వినిపించగా, చందమామ వాటిని కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాజల్‌ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Read More:

సోదరుడి మృతి.. ట్రంప్ భావోద్వేగ ప్రకటన‌

ఉపాసనను భార్యగా పొందడం నా అదృష్టం: రామ్ చరణ్‌

Loading...
Unable to load recommendations.
Follow Us