కాజల్ ‘వెబ్‌ సిరీస్’ ఎంట్రీ.. ఆ హాలీవుడ్‌ రీమేక్‌లో..!

ఇటీవల కాలంలో సినిమాలకు అతీతంగా వెబ్‌ సిరీస్‌లకు క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అందులో నటించేందుకు టాప్ హీరో హీరోయిన్లు ఆసక్తిని చూపుతున్నారు.

కాజల్ 'వెబ్‌ సిరీస్' ఎంట్రీ.. ఆ హాలీవుడ్‌ రీమేక్‌లో..!
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 1:48 PM

ఇటీవల కాలంలో సినిమాలకు అతీతంగా వెబ్‌ సిరీస్‌లకు క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అందులో నటించేందుకు టాప్ హీరో హీరోయిన్లు ఆసక్తిని చూపుతున్నారు. ఇక స్టార్‌ దర్శకులు సైతం వెబ్‌ సిరీస్‌లను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ చందమామ కాజల్‌ వెబ్‌ సిరీస్‌లో అడుగుపెట్టబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం కాజల్‌.. ఓ హాలీవుడ్‌ పాపులర్ సిరీస్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

హాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన క్వాంటికో సిరీస్‌ ప్రస్తుతం నాలుగో సీజన్‌కి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే భారతీయ ప్రేక్షకుల కోసం ఈ సిరీస్‌ని రీమేక్‌ చేయబోతున్నారట. ఇక ఇందులో ప్రియాంక చోప్రా పాత్రలో చందమామ మెరవనుందట. మొదటి నుంచి ఈ సిరీస్‌ను ఫాలో అవుతున్న కాజల్‌.. ఇప్పుడు రీమేక్‌లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో ఆరుకు పైగా చిత్రాల్లో కాజల్ నటిస్తోన్న విషయం తెలిసిందే.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..