Jacqueline Fernandez: ప్రియాంకా ఇంటిని కొనుగోలు చేసిన శ్రీలంక బ్యూటీ.. ధర ఎంతో తెలిస్తే షాక్‌ కావాల్సిందే..

|

Feb 09, 2021 | 5:31 PM

Jacqueline fernandez Buy Costly House: తమకంటూ ఓ సొంతిళ్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. దీనికి సెలబ్రిటీలు కూడా అతిథులేం కాదు. కాస్త డబ్బులు సంపాదించుకోగానే ఇంటి కొనుగోలుపై ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా..

Jacqueline Fernandez: ప్రియాంకా ఇంటిని కొనుగోలు చేసిన శ్రీలంక బ్యూటీ.. ధర ఎంతో తెలిస్తే షాక్‌ కావాల్సిందే..
Follow us on

Jacqueline fernandez Buy Costly House: తమకంటూ ఓ సొంతిళ్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. దీనికి సెలబ్రిటీలు కూడా అతిథులేం కాదు. కాస్త డబ్బులు సంపాదించుకోగానే ఇంటి కొనుగోలుపై ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా నటీమణులు తమకు అవకాశాలు ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయో అక్కడ ఇంటిని కొనుగోలు చేస్తుంటారు.
ఈ క్రమంలో టాలీవుడ్ తారలు హైదరాబాద్‌లో ఇంటిని కొనుగోలు చేస్తే.. బాలీవుడ్‌ సినీ తారలు ముంబైలో సొంతింటిని ప్లాన్‌ చేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలంకన్‌ బ్యూటీ.. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళుతోన్న నటి జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది. దీని ధర ఎంతో తెలుసా..? అక్షరాల రూ.7 కోట్లు. అంతలా ఈ ఫ్లాట్‌లో ఏముందనేగా మీ సందేహం. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఈ ఫ్లాట్‌ బాల్కనీలో నుంచి చూస్తే సముద్రం వ్యూ కనిపిస్తుంది. ఐదు బెడ్‌ రూమ్‌లు, విశాలమైన లివింగ్‌ ఏరియాతో కూడిన ఈ ఫ్లాట్‌లో ఇది వరకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నివసించేది. ప్రియాంక వివాహానికి ముందు ఈ ఇంటిలోనే ఉండేది. నిక్‌ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక అమెరికా వెళ్లే సమయంలో ఈ ఫ్లాట్‌ను అమ్మేసింది. దీంతో ప్రస్తుతం జాక్వలిన్‌ ఈ ఇంటిని కొనుగోలు చేసింది. ఇక జాక్వలిన్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ఈ బ్యూటీ.. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌-క్రిష్‌ కాంబినేషనల్ రానున్న సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: పల్లెటూరి అమ్మాయి డ్యాన్స్‏కు ఫిదా అయిన బాలీవుడ్ బ్యూటీ.. సో బ్యూటీఫుల్ అంటూ ట్వీట్ చేసిన మాధురీ..