పవన్‌తో రొమాన్స్‌ చేయబోయేది ఈ బ్యూటీనా.. వావ్..! ఎంత అందంగా ఉందో..!

'గబ్బర్‌సింగ్' కాంబినేషన్ రిపీట్ అవుతోన్న విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్- హరీష్ శంకర్‌- దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కబోతోంది.

  • Tv9 Telugu
  • Publish Date - 3:40 pm, Tue, 12 May 20
పవన్‌తో రొమాన్స్‌ చేయబోయేది ఈ బ్యూటీనా.. వావ్..! ఎంత అందంగా ఉందో..!

‘గబ్బర్‌సింగ్’ కాంబినేషన్ రిపీట్ అవుతోన్న విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్- హరీష్ శంకర్‌- దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గబ్బర్‌ సింగ్ విడుదలై 8 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ‘ఇప్పుడే మొదలైంది’ అని ట్వీట్ చేసిన హరీష్ శంకర్‌.. తమ సినిమాపై ఫ్యాన్స్‌కి అప్‌డేట్ ఇచ్చారు. కాగా పవన్‌ 28వ చిత్రంగా తెరకెక్కబోతోన్న ఈ మూవీలో అతడి సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు వినిపించింది. అయితే తాజాగా మలయాల కుట్టీ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మాలీవుడ్‌కు చెందిన మానసా రాధాకృష్ణన్‌ అనే హీరోయిన్‌ను పవన్ కోసం ఫైనల్ చేసినట్లు టాక్‌ నడుస్తోంది. దీంతో ఆమె బయోగ్రఫీని సెర్చ్‌ చేసిన పవన్‌ ఫ్యాన్స్‌.. మానసా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మానసా ట్రెండ్‌గా మారగా.. ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించిన మానసా.. మాలీవుడ్‌లో ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తోంది. 21 సంవత్సరాలున్న ఈ ముద్దు గుమ్మ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.

Read This Story Also: ఇడ్లీలమ్మా.. నీ స్వార్థం లేని సేవ ముందు ఎన్ని కోట్లైనా దిగదుడుపే..!