Playboy Model Ju Isen: రూ. 15 కోట్ల విలువైన ఆస్థిని తన పెంపుడు కుక్క ఫ్రాన్సిస్కో కు రాసిన మోడల్.. ఎక్కడంటే

Playboy Model Ju Isen: పెంపుడు జంతువులకు తన యజమానిపై ఉన్న విశ్వాసం కడుపున పుట్టిన పిల్లలకు కూడా ఉండదు అని చాల సంఘటనలు రుజువు చేశాయి..

Playboy Model Ju Isen: రూ. 15 కోట్ల విలువైన ఆస్థిని తన పెంపుడు కుక్క ఫ్రాన్సిస్కో కు రాసిన మోడల్.. ఎక్కడంటే
Playboy Model Ju Isen

Updated on: Oct 09, 2021 | 7:54 PM

Playboy Model Ju Isen: పెంపుడు జంతువులకు తన యజమానిపై ఉన్న విశ్వాసం కడుపున పుట్టిన పిల్లలకు కూడా ఉండదు అని చాల సంఘటనలు రుజువు చేశాయి. విదేశీయులు తమ పెంపుడు జంతువులకు పుట్టిన రోజు వేడుకలను జరుపుతారు.. అందంగా అలంకరిస్తారు.. ఏకంగా తమ ఆస్తులను సైతం వాటికీ రాసి ఇస్తారు. తాజాగా ఓ మోడల్ తన పేరు మీద ఉన్న రూ. 15కోట్ల ఆస్తి మొత్తాన్ని పెంపుడు కుక్క ‘ఫ్రాన్సిస్కో’కు  రాసింది.

ప్లే బాయ్ మోడల్ జు ఐసెన్ తనకు పిల్లలు లేరని.. తన సంపాదన తన పెంపుడు కుక్క ఫ్రాన్సిస్కోకు రాస్తున్నాని ప్రకటించింది. ఈ మేరకు ఫ్రాన్సిస్కో లాయర్లను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుని చట్టబద్ధంగానే తన తదనంతరం తన ఆస్తిపై పూర్తి హక్కు తన శునకానికే అంటూ వీలునామా రాసింది. దీంతో ఒక్కసారిగా జు ఐసెన్ కుక్క అపార్ట్‌మెంట్లు, కార్లకు యజమాని అయిపోయింది.

మోడల్ జు ఐసెన్.. నేను ఈరోజు ఈ స్టేజ్ కు రావడానికి ఎంతో కష్టపడ్డానని.. ఇక భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని చెప్పింది. తాను సంపాదించిన డబ్బు తన కుక్కకు మంచి జీవితాన్ని ఇస్తుందని తెలిపింది. ఇక తన కుక్క బతికినంత కాలం దానిని ప్రేమగా చూస్తూ .. సంరక్షించిన వారు ఆస్తిని అనుభవించే హక్కు ఉందని తెలిపింది జు ఐసెన్  చెప్పారు.

ఇక జు ఐసెన్ సోషల్ మీడియా లో ఎక్కువగా తన పెంపుడు కుక్క ఫ్రాన్సిస్కోతో ఉన్న ఫోటోలు షేర్ చేస్తుంది. ఇక అందంగా కనిపించడానికి ఈ ఏడాది మొదట్లో రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఈ ప్లే బాయ్ మోడల్ మొత్తం  నాలుగు లిపోసక్షన్ ప్రొసీజర్స్ సర్జరీలు చేసుకుంది.

Also Read:  లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న పొడవైన జుట్టు.. వీడియో వైరల్..