Double Decker Bus House: సామాన్యులకైనా, సెలబ్రెటీలకైనా సొంత ఇల్లు ఓ కల.. ఆ కల నెరవేరాలని తమ శక్తికి మించి కష్టపడతారు. అయితే అందమైన అన్ని హంగులు ఉన్న ఇల్లుని కట్టుకోవడం అందరి వల్ల కాదు.. దీంతో కొంతమంది తమకు ఉన్న సంపాదనకు అనుగుణంగా సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు. తాజాగా ఓ మోడల్ తన సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి డిఫరెంట్ గా ఆలోచించింది. డబుల్ డెక్కర్ బస్సునే డ్రీమ్ హౌస్ గా మార్చుకుంది. ఎవరా మోడల్ వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలో చాలా మంది మోడల్స్ ఓన్లీఫ్యాన్స్ వెబ్‌సైట్‌లో చేరి… స్కిన్ షో మోడలింగ్ చేస్తూ… మనీ సంపాదిస్తుంటారు. తాజాగా ఈ లిస్టులో 28 ఏళ్ల హేలీ రాసన్ కూడా చేరింది. ఈమెకు ఎప్పటి నుంచో డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని కల. కానీ అందుకు డబ్బు ఉండేది కాదు. ఐతే… ఓన్లీ ఫ్యాన్స్ వెబ్‌సైట్‌లో చేరాక తన కల నెరవేరింది. అద్భుతమైన ఇల్లు నిర్మించుకుని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇంత వరకూ ఇలాంటి ఇంటిని ఎప్పుడూ చూసి ఉండరు. మరి ఆ ఇంటి ప్రత్యేకతేంటో చూద్దాం..
హేలీ రాసన్ తన ఇంటికలను నెరవేర్చుకోడానికి చాలినంత డబ్బు లేకపోవడంతో వినూత్నంగా ఆలోచించింది. ఓ బస్సును తన ఇల్లుగా మార్చేసుకుంది. మామూలు బస్సు అయితే ఇంటికి సరిపోదనుకున్న ఆమె 3 లక్షల 27 వేల రూపాయలతో ఓ డబుల్ డెక్కర్ బస్సునుకొనుగోలు చేసింది. ఆ బస్సునే తన ఇంటిగా మార్చేసుకుంది. హేలీ తన బస్సు ఇంటి కోసం 4 లక్షలతో సోలార్ ప్యానెళ్లు, ఇన్సులేషన్ బోర్డులు, బాయిలర్ వంటివి ఏర్పాటు చేసుకొని అధునాతన హంగులతో సర్వాంగసుందరంగా తయారు చేసుకుంది. మామూలుగా ఒక రిచ్ ఇంట్లో ఉండే అన్ని వసతులూ అందులో ఏర్పాటు చేసుకుంది. తన బస్ కమ్ ఇంటిలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తోంది. నార్త్ వేల్స్‌లోని ఓ ఖాళీ జాగాలో ఆ బస్సును రోజూ పార్క్ చేసుకుంటోంది. న్యూఇయర్‌లో తన 7 నెలల కుక్క ఎరిక్, మూడు పిల్లులతో కలిసి ట్రావెల్ చేస్తానంటోంది హేలీ. తనకి ఈ ఆలోచన రావడానికి టిక్ టాకే కారణమట. చాలా వీడియోల్లో ఎగ్జాంపుల్స్ చూసి…. లండన్ చెందిన ఓ కంపెనీ పాత బస్సులను అమ్ముతుంటే ఒకటి కొని ఇల్లులా మార్చుకున్నానని చెబుతోంది. ఓన్లీఫ్యాన్స్ సబ్‌స్క్రైబర్ల వల్లే తాను ఈ బస్సును కొనుక్కోగలిగానంటున్న హేలీ… తన ఫ్యాన్స్ అంతా ఎంతో మంచివారని ప్రశంసలు కురిపిస్తోంది.