ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌..!

|

Apr 13, 2019 | 1:06 PM

హైదరాబాద్: ‘బాహుబలి’ సినిమాతో స్టార్ హీరో ప్రభాస్‌కు అమాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. కాగా రీసెంట్ గా ప్రభాస్ సోషల్ మీడియాలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌ లో తన అకౌంట్ ఓపెన్ చేశారు. అయితే అకౌంట్ లో ఇంకా ప్రొఫైల్‌ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్‌ చేయలేదు. అయినప్పటికీ ఆయన అకౌంట్‌కు ఏడు లక్షల ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఇప్పటివరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌ కూడా పెట్టలేదు. కేవలం అకౌంట్‌కు యాక్టర్‌ ప్రభాస్‌ అన్న […]

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌..!
Follow us on

హైదరాబాద్: ‘బాహుబలి’ సినిమాతో స్టార్ హీరో ప్రభాస్‌కు అమాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. కాగా రీసెంట్ గా ప్రభాస్ సోషల్ మీడియాలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌ లో తన అకౌంట్ ఓపెన్ చేశారు. అయితే అకౌంట్ లో ఇంకా ప్రొఫైల్‌ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్‌ చేయలేదు. అయినప్పటికీ ఆయన అకౌంట్‌కు ఏడు లక్షల ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఇప్పటివరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌ కూడా పెట్టలేదు. కేవలం అకౌంట్‌కు యాక్టర్‌ ప్రభాస్‌ అన్న పేరు మాత్రమే పెట్టుకున్నారు. ఇక ఆ ఒక్క పేరుతో ఎంతోమంది అభిమానులు అకౌంట్ ను అనుసరిస్తున్నారంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో మనకు అర్ధమవుతోంది.

మరోవైపు ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుజిత్‌ ‘సాహో’కు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్ కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.