Sitaramam OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘సీతారామం’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే.?

|

Sep 05, 2022 | 1:56 PM

చిన్న సినిమా.. తక్కువ ప్రమోషన్స్.. అయినా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్. దేని గురించి అనుకుంటున్నారా.? మరేది కాదు..

Sitaramam OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సీతారామం.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే.?
Follow us on

చిన్న సినిమా.. తక్కువ ప్రమోషన్స్.. అయినా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్. దేని గురించి అనుకుంటున్నారా.? మరేది కాదు.. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌గా రిలీజై సూపర్ హిట్ సాధించిన ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో నటించగా.. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. అంతేకాకుండా లాంగ్ రన్‌లో సుమారు రూ. 80 కోట్ల వసూళ్లు సాధించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా హిందీ విడుదలైన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ఓటీటీ విడుదల అయ్యేందుకు సిద్దం అవుతోంది. దాదాపుగా సినిమా లాంగ్ రన్ పూర్తి కావడంతో.. ఈ నెల 9వ తేదీ నుంచి అమోజన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. భారీ ధరకు ఈ చిత్రం డిజిటల్ హక్కులు అమెజాన్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, అటు సెప్టెంబర్ 9వ తేదీన ‘బింబిసారా’ కూడా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.