
బాలీవుడ్ సీనియర్ నటి, ఫిట్‌నెస్ ఫ్రీక్ మలైకా అరోరా తన అందం, ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసు పెరుగుతున్నా ఆమె ఇంకా కుర్ర హీరోయిన్లకు పోటీనిచ్చేలా మెరిసిపోవడానికి కారణం ఆమె తీసుకునే పోషకాహారమే. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఆమె తన మార్నింగ్ డ్రింక్ రహస్యాన్ని బయటపెట్టారు. అదే రెటినోల్ జ్యూస్. మేకప్ రూమ్‌లో జుట్టును సరిచేయించుకుంటూనే ఈ హెల్తీ జ్యూస్ తాగుతూ ఆమె కనిపించారు.
Malaika Arora’s Healthy Juice
మొదట క్యారెట్లు, దోసకాయ, అల్లం శుభ్రంగా కడిగి పైన తొక్క తీయాలి. వాటన్నింటినీ జ్యూసర్‌లో వేసి రసం తీయాలి. అందులో నారింజ రసం మరియు నిమ్మరసం కలపాలి. చివరగా వడకట్టి వెంటనే తాగేయాలి. వడకట్టిన తర్వాత మిగిలిన పిప్పిని పారేయకుండా పరోటాల తయారీలో వాడుకోవచ్చని మలైకా సూచించారు.
ఈ జ్యూస్‌లో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ ఏ (రెటినోల్) గా మారుతుంది.
అంతేకాదు, ఒక పాడ్‌కాస్ట్‌లో సోహా అలీ ఖాన్‌తో మాట్లాడుతూ మలైకా తన ఆహారపు అలవాట్లపై మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు టీ, కాఫీ తాగే అలవాటు అస్సలు లేదని, ఉదయాన్నే కేవలం కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ తాగడానికే ఇష్టపడతానని ఆమె తెలిపారు.
చిన్నప్పటి నుండి పాలు తాగడం అలవాటని, కెఫిన్ ఆధారిత పానీయాల కంటే ప్రకృతి సిద్ధమైన పానీయాలే ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆమె నమ్ముతారు. అందం అనేది బయటి పూతలతో మాత్రమే రాదు, మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. మలైకా అరోరా లాగా మీ చర్మం కూడా మెరిసిపోవాలంటే, రేపటి నుంచి మీ రోజును ఈ హెల్తీ రెటినోల్ జ్యూస్‌తో ప్రారంభించి చూడండి!