
పైన పేర్కొన్న ఫోటోలో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా.? సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి నటించిన ఈ చిన్నోడు.. ఇప్పుడొక స్టార్ హీరో.. అమ్మాయిల గ్రీకువీరుడు, మాస్ కా బాప్.. ఎవరో గుర్తుపట్టగలరా.? చైల్డ్ ఆర్టిస్ట్‌గా, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఇతడు.. ఇప్పుడు రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరో. ఇతడికి అన్ని భాషల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్ హీరో కథతోనూ ప్రేక్షకులను అలరించాడు. ఎవరో కనిపెట్టగలిగారా.? అయితే మీకో చిన్న క్లూ ఇస్తా.? బాలీవుడ్‌లో వచ్చిన ‘ధూమ్‘ సిరీస్ మీకు తెలిసిందే కదా.. అందులో స్టైలిష్ విలన్‌గా అందరినీ ఆకట్టుకున్నది ఈ చిన్నోడే.. హా.. ఎస్ మీరు అనుకున్నది కరెక్టే.. అతడెవరో కాదు హృతిక్ రోషన్.
‘కహో నా ప్యార్ హై’ సినిమాతో బాలీవుడ్‌కు హీరోగా పరిచయమైన హృతిక్ రోషన్.. ‘కోయి మిల్ గయా’, ‘లక్ష్య’, ‘క్రిష్’, ‘ధూమ్ 2’, ‘సూపర్ 30’, ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించాడు. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు చిత్రాలకు చేసిన హృతిక్ రోషన్‌కు.. మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హృతిక్ చేసిన సినిమాలు కేవలం హిందీలోనే మాత్రమే కాదు.. ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతున్నాయి. కాగా, హృతిక్ తాజాగా చిత్రం ‘విక్రమ్ వేద’ సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.