Ileana : నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే ఆ మూవీ చేయాల్సింది..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకుంది. ఇక ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి సినిమాలో కనిపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ మూవీతో ఇలియానా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది.

Ileana : నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే ఆ మూవీ చేయాల్సింది..
Ileana
Follow us

|

Updated on: Apr 24, 2024 | 7:47 AM

ఒకప్పుడు తెలుగు కుర్రాళ్ల మతిపోగొట్టిన హీరోయిన్ ఇలియానా. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్స్ విషయంలో సరికొత్త ట్రెండ్ మార్క్ సెట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకుంది. ఇక ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి సినిమాలో కనిపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ మూవీతో ఇలియానా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది.

పోకిరి తర్వాత ఇండస్ట్రీలో ఇలియనా క్రేజ్ మారిపోయింది. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కోటి రూపాయాల రెమ్యునరేషన్ తీసుకున్న మొట్ట మొదటి హీరోయిన్ గా ఆమె పేరు మారుమోగింది. అయితే ఇలియానా కథానాయికగా నటించాల్సిన సినిమా దేవదాసు కాదట. అంతకు ముందే ఆమె ఓ ప్రాజెక్ట్ ఛాన్స్ మిస్సయ్యిందట. అప్పట్లో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ధైర్యం సినిమాతో ఇలియానా సినీ పరిశ్రమకు పరిచయం కావాల్సింది. ఆ మూవీ కోసం అడిషన్ ఇచ్చి దాదాపు 3 నెలలు డేట్స్ కూడా ఇచ్చిందట. కానీ పలు కారణాల చేత ఇలియానా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

నితిన్ నటించిన ధైర్యం సినిమా 2005లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఏడాది 2006లో దేవదాసు మూవీ రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఆ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. కొన్నాళ్లపాటు హిందీలో వరుస సినిమాలు చేసిన ఇలియానా ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. గతేడాది ఆగస్టులో బాబుకు జన్మినిచ్చింది. విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, సెంథిల్ రామమూర్తి ప్రధాన పాత్రల్లో నటించిన దో ఔర్ దో ప్యార్‌ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఇలియానా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..