Lambasingi OTT: రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా.. లంబసింగి స్ట్రీమింగ్ ఎప్పుడంటే

|

Mar 29, 2024 | 6:13 PM

బిగ్ బాస్ బ్యూటీ దివి నటించిన లంబసింగి. బిగ్ బాస్ గేమ్ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివి అంతకు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా కనిపించింది.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించింది. ఇక బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది.

Lambasingi  OTT: రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా.. లంబసింగి స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Divi Vadthya
Follow us on

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెలరోజులకు ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సినిమా కూడా ఓటీటీలోకి వస్తుంది. అదే బిగ్ బాస్ బ్యూటీ దివి నటించిన లంబసింగి. బిగ్ బాస్ గేమ్ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివి అంతకు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా కనిపించింది.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించింది. ఇక బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ తర్వాత దివికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.

ఇక ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఈ క్రేమంలోనే ఇటీవలే లంబసింగి అనే సినిమా చేసింది. అందమైన ప్రేమకథతో పాటు ఆసక్తిగా ట్విస్ట్ లతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో దివి చాలా యాక్టివ్ గా పాల్గొంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టింది.

ఇక ఇప్పుడు రెండు వారాల్లోనే ఓటీటీలోకి ఈ సినిమా రానుంది. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది లంబసింగి. ఇక ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది ఈ సినిమా. లంబసింగి సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. లంబసింగి మూవీ ఏప్రిల్ 2 నుంచి హాట్‌స్టార్ ఓటీటీలోకి వస్తోంది. ఓ పోలీస్ కానిస్టేబుల్, ఓ నక్సలైట్ కూతురు మధ్య సాగే ప్రేమ కథతో ఈ సినిమా తెరకెక్కింది.

దివి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

దివి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.