తండ్రి అయిన అమలాపాల్ మాజీ భర్త..!

అమలా పాల్ మాజీ భర్త, ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్‌ తండ్రి అయ్యారు. ఆయన భార్య ఐశ్వర్య విజయ్‌.. ఈ ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విజయ్‌ సోదరుడు, నటుడు ఉదయ సోషల్ మీడియాలో తెలిపారు. ”నేను పెద్దనాన్నని అయ్యాను. ఉదయం గం.11.25నిల. సమయంలో విజయ్‌, ఐశ్వర్య దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది” అని ఉదయ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు […]

తండ్రి అయిన అమలాపాల్ మాజీ భర్త..!

Updated on: May 30, 2020 | 1:08 PM

అమలా పాల్ మాజీ భర్త, ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్‌ తండ్రి అయ్యారు. ఆయన భార్య ఐశ్వర్య విజయ్‌.. ఈ ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విజయ్‌ సోదరుడు, నటుడు ఉదయ సోషల్ మీడియాలో తెలిపారు.

”నేను పెద్దనాన్నని అయ్యాను. ఉదయం గం.11.25నిల. సమయంలో విజయ్‌, ఐశ్వర్య దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది” అని ఉదయ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా అమలా పాల్‌తో విడాకుల తరువాత ఏఎల్ విజయ్,‌ ఐశ్వర్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ దర్శకుడు కంగనా రనౌత్ హీరోయిన్‌గా ‘తలైవి’ని తెరకెక్కిస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తవ్వగా.. మొదటి భాగాన్ని జూన్ 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో జయలలిత బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read This Story Also: Mahesh27: సూపర్‌స్టార్ వర్సెస్ సూపర్‌స్టార్..!

Loading...
Unable to load recommendations.
Follow Us