
దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటైన యమలీల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా అలీని హీరోగా ఎంపిక చేయడం, ఆ నిర్ణయం వెనుక గల కారణాలను ఆయన వివరించారు. యమలీల ఒక సంచలనం అయిందని, అది ఎంత ప్రయోగాత్మకమో అంత సంచలనం అని కృష్ణారెడ్డి అన్నారు. అలీని హీరోగా ఎంపిక చేయడానికి ప్రధాన కారణం అతని సహజమైన అమాయకత్వం పాత్రలో జీవించగల సామర్థ్యం. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు పాత్రను నటిస్తే, అలీ దానిని జీవిస్తాడు అని ఎస్.వి. కృష్ణారెడ్డి చెప్పారు. సినిమాలోని పాత్ర రూ.1 కోటి కావాలంటే రూ.1ని కోటి సార్లు లెక్కపెడితే కోటి అవుతుందనే అమాయకత్వంతో ఉంటుంది. ఈ అమాయకత్వాన్ని అలీ సహజంగా ప్రదర్శించగలడని అనుకున్నానని అన్నారు. ప్రముఖ నటి సౌందర్య కూడా మొదట అలీ పక్కన నటించడానికి నిరాకరించినా, ఆ తర్వాత ఒప్పుకొని నటించారని, అది ఆమె గొప్పతనమని కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు. యమలీల ఆల్ ఇండియాలో మైనే ప్యార్ కియా స్థాయిలో ఆంధ్రలో హిట్ అయిందని, అది అలీని ఒక హీరోగా నిలబెట్టిందని ఆయన తెలిపారు.
ఎస్.వి. కృష్ణారెడ్డి కెరీర్‌లో అచ్చిరెడ్డి పాత్ర అనన్య సామాన్యం. అచ్చిరెడ్డి స్క్రిప్ట్ ఎడిటింగ్‌లో కీలక భూమిక పోషిస్తారని, అనవసరమైన సన్నివేశాలు, సంభాషణలు తొలగించి డబ్బు ఆదా చేస్తారని కృష్ణారెడ్డి వివరించారు. పేపర్‌పై ఒక సీన్‌ను తీసేస్తే పైసా ఖర్చు ఉండదని, అదే షూట్ చేశాక తీసేస్తే రూ.25 లక్షలు ఖర్చవుతుందని ఆయన ఉదాహరించారు. అచ్చిరెడ్డి ప్రణాళికాబద్ధమైన విధానం, ఆర్థిక విషయాల్లో ఆయన నిజాయితీని కృష్ణారెడ్డి ప్రశంసించారు. బయట నిర్మాతలు కూడా అచ్చిరెడ్డి ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌ను కోరేవారట. దర్శకత్వ ప్రయాణంలో దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలతో తనను పోల్చడం గురించి మాట్లాడగా, తనకు ఎస్.వి. కృష్ణారెడ్డి అనే ప్రత్యేక గుర్తింపు ఉందని స్పష్టం చేశారు. దాసరి నారాయణరావు తన సంగీత సామర్థ్యాన్ని ప్రశంసించిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ.వి.వి. సత్యనారాయణతో సమాంతరంగా సాగిన తమ ప్రయాణాన్ని ఒక “గోల్డెన్ పీరియడ్”గా అన్నారు. బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో తీసిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, ఎస్.వి. కృష్ణారెడ్డి పెద్ద హీరోలను హ్యాండిల్ చేయలేరు అనే అపవాదు వచ్చిందని ఆయన అంగీకరించారు. అయితే, త్వరలో చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
అయితే చినుకు చినుకు అందెలతో పాటను ముందుగా మాయలోడు, ఆ తర్వాత శుభలగ్నం సినిమాల్లో పెట్టారు. రెండుసార్లు ఈ మూవీలోని సాంగ్ సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పటికీ ఆ పాటకు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది.
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..
ఎక్కువ మంది చదివినవి: Raghu Babu : కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దేవుడు ఆయనే.. ఒక్క సినిమాతో 25 ఏళ్ల ఆస్తులు అమ్ముకున్నాం..