
ప్రస్తుతం సోషల్ మీడియా సెలబ్రెటీలకు.. అభిమానులకు మధ్య వారధిగా మారింది. తమ సినిమా అప్డేట్స్, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. అయితే కొన్నిసార్లు వారు షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ వల్ల ట్రోలింగ్‌కు గురవుతుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో అనవసరంగానూ నెటిజన్స్ నుంచి నెగిటివ్ కామెంట్రస్ వస్తుంటాయి. వాటిని కొందరు స్టార్స్ పట్టించుకోనప్పటికీ మరికొందరు నెటిజన్స్ దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంటారు. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన హరీశ్ శంకర్ ఓ నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డైరెక్టర్ హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సినిమాలే కాకుండా పలు అంశాలపై కూడా తనదైన శైలీలో స్పందిస్తుంటారు. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ గురించి చెబుతున్న ఓ వైద్య నిపుణిడి వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఓమిక్రాన్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని.. దైర్యంగా ఉండాలని ఆ వైద్యుడు సూచించాుర. ఈ వీడియోను షేర్ చేసిన హరీశ్ శంకర్.. వైరస్ వ్యాప్తి పట్ల సామాన్య ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ హరీశ్ శంకర్ పై సీరియస్ అయ్యాడు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని.. ఓమిక్రాన్ ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
సదరు నెటిజన్స్ కామెంట్స్ కామెంట్స్ పై హరీశ్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ” మీలాంటి ముర్ఖులు నిరుత్సాహానికి గురవుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఎప్పుడు మంచి మాటలు చెప్పరు.. ఒకవేళ ఎవరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు చెప్పిన మీరు వారికి ఆశలు కల్పించాలని కోరుకోరు” అంటూ ట్వీట్ చేశారు హరీశ్ శంకర్ .
డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..
Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బన్నీపై ప్రశంసల వర్షం కురిపించిన అర్జున్ కపూర్..