సెంటిమెంట్.. మైత్రీ మూవీ మేకర్స్‌కు రెండు హిట్లు పక్కానా..!

మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ నిర్మాణ సంస్థల్లో ఇదొకటి. ‘శ్రీమంతుడు’ ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ నిర్మాణ సంస్థ అనతి కాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. ఈ నిర్మాణ సంస్థల్లో భాగస్వామ్యులైన నవీన్, మోహన్, రవి ముగ్గురు.. దర్శకులు, హీరోలకు ఫేవరెట్‌గా మారిపోయారు. ఏ మూవీ షూటింగ్ అయినా వీరు మంచి సహకారం అందిస్తారన్న టాక్ కూడా టాలీవుడ్‌లో ఉంది. ఇక ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా […]

సెంటిమెంట్.. మైత్రీ మూవీ మేకర్స్‌కు రెండు హిట్లు పక్కానా..!
Follow us

| Edited By:

Updated on: Nov 01, 2019 | 2:07 PM

మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ నిర్మాణ సంస్థల్లో ఇదొకటి. ‘శ్రీమంతుడు’ ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ నిర్మాణ సంస్థ అనతి కాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. ఈ నిర్మాణ సంస్థల్లో భాగస్వామ్యులైన నవీన్, మోహన్, రవి ముగ్గురు.. దర్శకులు, హీరోలకు ఫేవరెట్‌గా మారిపోయారు. ఏ మూవీ షూటింగ్ అయినా వీరు మంచి సహకారం అందిస్తారన్న టాక్ కూడా టాలీవుడ్‌లో ఉంది. ఇక ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అందులో వైష్ణవ్ తేజ్‌- బుచ్చిబాబు ఇద్దరినీ పరిచయం చేస్తున్న ఉప్పెన ఒకటి కాగా.. మరొకటి అల్లు అర్జున్- సుకుమార్ చిత్రం.. ఇంకొకట కీరవాణి తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ ‘మత్తు వదలరా మూవీ’. వీటిలో ‘ఉప్పెన’, ‘మత్తు వదలరా షూటింగ్‌’లు జరుగుతుండగా. ఇక బన్నీ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇదిలా ఉంటే ఈ నిర్మాణ సంస్థలో ఇప్పటివరకు ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘సవ్యసాచి’, ‘అమర్ అక్బర్ ఆంటోని’, ‘చిత్రలహరి’, ‘డియర్ కామ్రేడ్’, ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’లు బ్లాక్‌ బస్టర్ విజయాలుగా.. ‘చిత్రలహరి’, ‘గ్యాంగ్‌లీడర్‌’లు హిట్లుగా.. ‘సవ్యసాచి’, ‘అమర్ అక్బర్ ఆంటోని’, ‘డియర్ కామ్రేడ్’లు ఫ్లాప్‌లుగా నిలిచాయి. కాగా హిట్‌గా నిలిచిన ఐదు చిత్రాల్లో నాలుగు చిత్రాలకు దేవీ శ్రీ ప్రసాద్‌నే సంగీతం అందించడం విశేషం. ఈ రకంగా వారికి డీఎస్పీ హిట్ సెంటిమెంట్‌గా మారాడని టాక్. ఇక ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉప్పెన, బన్నీ-సుకుమార్ ప్రాజెక్ట్‌కు దేవీ శ్రీ ప్రసాద్‌నే సంగీతం అందిస్తున్నాడు. సెంటిమెంట్ ప్రకారంగా ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. దేవితో వారు మరిన్ని సినిమాలు తీసినా.. ఆశ్చర్యపోవక్కర్లేదు. మరి దేవి సెంటిమెంట్ మైత్రీ మూవీ మేకర్స్‌కు ఏ మాత్రం అచ్చొస్తుందో చూడాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..