Dharmavarapu Subramanyam: వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా వదలని మరణం.. చివరి రోజుల్లో కన్నీటి కష్టాలు..

విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తూనే ఆనందో బ్రహ్మా షోతో గుర్తింపు పొంది, తెలుగు చిత్రసీమలో స్టార్ కమెడియన్‌గా ఎదిగిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. జీవితంలో రెండుసార్లు ప్రాణాపాయ ప్రమాదాల నుంచి బయటపడిన ఆయన, క్యాన్సర్ మహమ్మారి కారణంగా చివరి రోజుల్లో ఎంతో బక్కచిక్కి కన్నీటి కష్టాలు అనుభవిస్తూ తెలుగు సినీ లోకాన్ని విడిచివెళ్లారు.

Dharmavarapu Subramanyam: వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా వదలని మరణం.. చివరి రోజుల్లో కన్నీటి కష్టాలు..
Dharmavarapu Subramanyam

Updated on: Nov 28, 2026 | 10:30 AM

తెలుగు సినిమా చరిత్రలో తనదైన ప్రత్యేక శైలి, డైలాగ్స్, సహజమైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. కేవలం హాస్యనటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, బుల్లితెర కళాకారుడిగా, ప్రభుత్వ అధికారిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. తెరపై ఎన్నో నవ్వులు పూయించినప్పటికీ, ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక సవాళ్లు, కష్టాలు, ఆఖరి రోజుల్లో బాధాకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒంగోలులో చదువుకునే రోజుల్లోనే తండ్రిని కోల్పోవడంతో చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు ధర్మవరపు భుజాన పడ్డాయి. నాటకాలపై ఉన్న ఆసక్తితో సినిమా అవకాశాల కోసం మద్రాస్ వెళ్లినా, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తిరిగి వచ్చారు. ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి హైదరాబాద్‌లో విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (VDO)గా ఉద్యోగం సాధించారు. ఉద్యోగం చేస్తూనే దూరదర్శన్‌లో ఆనందో బ్రహ్మా వంటి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులకు విశేషంగా చేరువయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రంతో వెండితెరకు పరిచయమైన ధర్మవరపు, ఆ తర్వాత నువ్వు నేను, మన్మథుడు, అతడు, రెడీ, ఒక్కడు వంటి ఎన్నో చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా నువ్వు నేనులో ఎంఎస్ నారాయణతో కలిసి ఆయన పండించిన హాస్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సాయంత్రం ఆరు గంటల తర్వాత షూటింగ్‌లకు ముగింపు పలికి కుటుంబానికి సమయం కేటాయించే క్రమశిక్షణ ఆయన ప్రత్యేకత.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

ధర్మవరపు జీవితంలో ప్రాణాపాయ ఘటనలు కూడా ఎదురయ్యాయి. ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు కింద కారు నలిగిపోయినా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే శ్వేతనాగు షూటింగ్ సమయంలో విషకీటకం కుట్టడంతో శ్వాస ఆడక ఇబ్బంది పడినప్పుడు, భార్య సమయస్ఫూర్తితో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు నిలిచాయి. అయితే ఆ తర్వాత కామెర్లు కాస్త క్యాన్సర్‌గా మారడంతో చివరి రోజుల్లో ఎంతో బక్కచిక్కిపోయారు. ఎప్పుడూ తనను ఆరోగ్యంగా, ఉత్సాహంగా చూసిన ప్రేక్షకులు, సన్నిహితులు ఆ స్థితిలో చూడకూడదని చివరి రోజుల్లో ఎవరినీ కలవలేదు. 2013 డిసెంబర్ 7న ఆయన తుదిశ్వాస విడిచి తెలుగు సినీ లోకానికి తీరని లోటు మిగిల్చారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

Loading...
Unable to load recommendations.
Follow Us