Ramayan: రామాయణంలో సీతగా సాయి పల్లవి.. చిన్నారి జానకిగా నటిస్తున్న బుజ్జాయి ఎవరంటే..

ఈ మూవీలో రాముడి పాత్రలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కనిపించనున్నాడు. అలాగే సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనుంది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఎంతో మంది స్టార్ నటీనటులు ఈ మూవీలో భాగం కాబోతున్నారు. సన్నీ డియోల్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్, యశ్ వరకు ఈ సినిమాలో కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ చిన్నారి జానకిగా కనిపించే బుజ్జాయి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

Ramayan: రామాయణంలో సీతగా సాయి పల్లవి.. చిన్నారి జానకిగా నటిస్తున్న బుజ్జాయి ఎవరంటే..
Ramayan
Follow us

|

Updated on: Apr 24, 2024 | 10:46 AM

బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా రామాయణం. ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రామాయణం ఆధారంగా.. రామాయణం గురించి అనేక చిత్రాలు వచ్చాయి. కానీ ఇప్పుడు రామా సీత కథను మొత్తం మూడు భాగాలుగా తీసుకువస్తున్నారు డైరెక్టర్ నితీష్. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ నెట్టింట వైరలవుతుంది. ఈ మూవీలో రాముడి పాత్రలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కనిపించనున్నాడు. అలాగే సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనుంది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఎంతో మంది స్టార్ నటీనటులు ఈ మూవీలో భాగం కాబోతున్నారు. సన్నీ డియోల్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్, యశ్ వరకు ఈ సినిమాలో కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ చిన్నారి జానకిగా కనిపించే బుజ్జాయి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

రామాయణంలో చిన్నారి సీత పాత్రలో కియారా కనిపించనుంది. బుల్లితెరపై స్టార్ ప్లస్ ఛానల్లో పాండ్యా స్టోర్ సీరియల్ ద్వారా కియారా సాద్ గుర్తింపు తెచ్చుకుంది. అయితే చిన్నారి సీతగా కియారా కనిపించనుంది అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. బుల్లితెరపై ‘పాండ్యా స్టోర్’లో చుట్కీ క్యారెక్టర్‌లో నటించిన కియారా చాలా టీవీ షోలలో నటించింది. ఇటీవల, సోనీ లివ్‌లో ప్రసారమైన ‘రైసింఘని వర్సెస్ రైసింఘని’ సిరీస్‌లో కియారా చిన్న వయస్సులో ఉన్న అనుష్క (జెన్నిఫర్ వింగెట్) పాత్రను పోషించింది. సీరియల్స్‌తో పాటు పలు యాడ్ ఫిల్మ్‌లలో కూడా కనిపించింది.

ఇదిలా ఉంటే.. రామాయణం సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా అలియా భట్ పేరు వినిపించింది. కానీ డైరెక్టర్ నితీష్ తివారీ మాత్రం సీత పాత్ర కోసం సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నాడు. ఈ రోల్ చేయడానికి సాయి పల్లవి రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. అలాగే ఇందులో సన్నీ డియోల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, యష్ తోపాటు మిగతా భాషలకు చెందిన నటీనటులు కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..