సినిమా తారల ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు బాగా వైరలవుతున్నాయి. నటుల ఆరోగ్యం విషమించిందని, ఆస్పత్రిలో చేరారని సోషల్ మీడియా వేదికగా వదంతులు వ్యాపిస్తున్నాయి. కొందరైతే చనిపోయారంటూ ఏకంగా పోస్టులు షేర్ చేస్తున్నాడు. ఇటీవల ప్రముఖ బెంగాలీ నటి అండ్రిలా శర్మ విషయంలోనూ ఇదే జరిగింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే చనిపోయినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు అలాంటిది మరొకటి జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే మృతిచెందినట్లు నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సామన్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్‌ముఖ్, అలీ గోనీ, జావెద్ జాఫరీ తదితరులు కూడా ట్విట్టర్ వేదికగా గోఖలే మృతికి సంతాపం కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో గోఖలే కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘విక్రమ్ గోఖలే ఇంకా బతికే ఉన్నారు. ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. వైద్యుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన కోసం ప్రార్థించండి’ అని ఓ ప్రకటన విడుదల చేసింది గోఖలే ఫ్యామిలీ. కాగా 77 ఏళ్లున్న విక్రమ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సమస్యలతో పాటు గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం పుణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో విక్రమ్ చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అప్పటికే మీడియాతో పాటు కొన్ని వెబ్సైట్లలో గోఖలే చనిపోయారంటూ వార్తలు వచ్చాయి.
హిందీతో పాటు మలయాళం, గుజరాతీ సినిమాల్లోనూ గోఖలే నటించారు. 90కి పైగా సినిమాల్లో నటించిన ఆయన మిషన్ మంగళ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భూల్ భులయ్యా, దిల్ సే, దే దానా దాన్, హిచ్కీ, నికమ్మ, బ్యాంగ్ బ్యాంగ్
వంటి హిట్ సినిమాల్లోనూ ఆయన కనిపించారు.
Prayers for Vikram Gokhale who has slipped into a Coma and is still very very critical according to his wife ? #VikramGokhale
— Sᴜᴢᴀɴɴᴇ Bᴇʀɴᴇʀᴛ (@suzannebernert) November 24, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..