Shah Rukh Khan: ఇది కదా సక్సెస్ అంటే.. అప్పుడు షారుఖ్ ఇంటి ముందు నిలబడిన కుర్రాడు.. ఇప్పుడు అంతకు మించి..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు స్టార్ నటుడిగా ప్రత్యేక హోదా సంపాదించుకున్నాడు. అలాగే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి రావాలనుకున్న సామాన్య యువకులకు షారుఖ్ స్పూర్తినిచ్చాడు. అందుకే అతడంటే అభిమానులకు చాలా ఇష్టం. బాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలా మంది నటీనటులు షారుఖ్ లాగా మారాలని కోరుకుంటారు. అతడిలా గుర్తింపు తెచ్చుకోవాలని పరిశ్రమలోకి అడుగుపెడతారు. అలాంటి వారిలో రాజ్ కుమార్ రావు ఒకరు. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది.

Shah Rukh Khan: ఇది కదా సక్సెస్ అంటే.. అప్పుడు షారుఖ్ ఇంటి ముందు నిలబడిన కుర్రాడు.. ఇప్పుడు అంతకు మించి..
Shah Rukh Khan
Follow us

|

Updated on: May 16, 2024 | 4:57 PM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ హీరో. షారుఖ్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసే అభిమానులు ఉన్నారు. అతడి మ్యానరిజం, స్టైల్, యాటిట్యూడ్ అంటే పడిచచ్చిపోయే అమ్మాయిలు ఉన్నారు. బాద్ షాకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు స్టార్ నటుడిగా ప్రత్యేక హోదా సంపాదించుకున్నాడు. అలాగే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి రావాలనుకున్న సామాన్య యువకులకు షారుఖ్ స్పూర్తినిచ్చాడు. అందుకే అతడంటే అభిమానులకు చాలా ఇష్టం. బాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలా మంది నటీనటులు షారుఖ్ లాగా మారాలని కోరుకుంటారు. అతడిలా గుర్తింపు తెచ్చుకోవాలని పరిశ్రమలోకి అడుగుపెడతారు. అలాంటి వారిలో రాజ్ కుమార్ రావు ఒకరు. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది.

శ్రీకాంత్ అనే సినిమాతో ఇప్పుడు భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో అంధుడిగా కనిపించి ప్రశంసలు అందుకున్నాడు. అంధుడైన పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా తుషార్ హీరానందని దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు అందుకుంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్ కుమార్ తన పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలను పంచుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ముంబై అంటే చాలా ఖరీదైనా ప్రాంతమని అనుకున్నానని తెలిపాడు.

గురుగ్రామ్ (గుడ్‌గావ్)కు చెందిన రాజ్‌కుమార్ రావు ‘బూగీ వూగీ’ డ్యాన్స్ షో కోసం ముంబై వచ్చారు. 16 ఏళ్ల వయసులోనే తన సోదరుడితో కలిసి ముంబై వచ్చాడు. అప్పుడు షారుఖ్ ఖాన్ ను ఎలాగైనా చూడాలని రోజంతా అతడి ఇంటి ముందు నిల్చున్నాడు. కానీ అప్పుడు షారుఖ్ తన ఇంట్లో లేడని తెలుసుకున్నాడు. “మొదటిసారి ముంబై వచ్చినప్పుడు ఇదొక స్వరంలాగా అనిపించింది. మా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి ముంబై మొత్తం తిరిగాము. చివరకు రైల్వే స్టేషన్లో పడుకున్నాం. కేవలం వడపావ్ కొనడానికి సరపడా డబ్బు ఇంది. రెండు రోజులు అక్కడే ఉన్నాం. షారుఖ్ ఖాన్ ను ఎలాగైనా చూడాలని మన్నత్ వద్దకు వెళ్లి రోజంతా నిలబడ్డాను. కానీ అప్పుడు షారుఖ్ ఇంట్లో లేడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ రావు నటించిన శ్రీకాంత్ సినిమా విజయవంతంగా దూసుకుపోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!