Sarah Ali Khan: గ్లామర్‌ షోతో మతి పోగొడుతున్న సారా అలీఖాన్.. సోషల్ మీడియాలో హాట్‌ ఫొటోలతో హల్‌చల్‌

|

Aug 23, 2021 | 6:05 PM

Sarah Ali Khan: తండ్రి సైఫ్ అలీఖాన్ నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది

Sarah Ali Khan: గ్లామర్‌ షోతో మతి పోగొడుతున్న సారా అలీఖాన్.. సోషల్ మీడియాలో హాట్‌ ఫొటోలతో హల్‌చల్‌
Sarah Ali Khan
Follow us on

Sarah Ali Khan: తండ్రి సైఫ్ అలీఖాన్ నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్. చేసినవి కొన్ని సినిమాలే అయినా నటిగా మంచి మార్కులు కొట్టేసిందీ చిన్నది. సినిమాల్లోకి రాక ముందు చాలా బొద్దుగా ఉన్న సారా పట్టుదలతో స్లిమ్‌గా మారింది. ఇటు సినిమాలు అటు సోష‌ల్ మీడియాతో తెగ సంద‌డి చేస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్‌కి గ‌ట్టి పోటీ ఇస్తున్న సారా ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్ మల్టీ స్టారర్ గా రూపొందిన ‘అత్రంగీ రే’ సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

సారా అలీఖాన్ సుశాంత్ సింగ్ ‌రాజ్‌పుత్‌ నటించిన ‘కేధార్‌నాథ్‌’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే మంచి విజయం సొంతం చేసుకుంది. తర్వాత వచ్చిన సింబా కూడా సూపర్ హిట్ అయింది. తన తల్లి అమృత నుంచే వారసత్వంగా నటన, స్టైల్ వచ్చాయని.. ఆమెకు గల పేరు తన సినీ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని తరచూ సారా చెబుతూ ఉంటుంది. చేసినవి రెండు, మూడు సినిమాలే అయినా సోషల్‌ మీడియాలో ల‌క్షల్లో ఫాలోవ‌ర్లను సంపాదించుకుంది. త‌న న‌ట‌న‌తో ఎంతోమంది మ‌న‌సు దోచుకుంది.

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సారా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంటుంది. గ్లామ‌ర్‌లో తాను ఎవ‌రికేమీ త‌క్కువ కాదన్నట్లు నిరూపిస్తోంది. తాజాగా క్లీవేజ్ షో ఫొటోల‌ను షేర్ చేసి హల్‌ చల్‌ చేస్తుంది. ఈ అమ్మడిలోని గ్లామ‌ర్ యాంగిల్‌ని చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు. ప్రస్తుతం సారా ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరినీ గడగడలాడించిన డ్రగ్స్ కేసులో సారా పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ కారణంగా కొన్ని సినిమా అవకాశాలను కూడా కోల్పోయినట్లు సమాచారం.

Vodafone Idea: అప్పుల్లో కూరుకుపోతున్న వొడాఫోన్‌ ఐడియా.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం అవుతుందా..?

‘మీ తండ్రి లాలూజీ ఎలా ఉన్నారు’ ? కుల గణన మీటింగ్ లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో ప్రధాని మోదీ

Karvy MD Parthasarathi: కార్వీ ఎండీ పార్థసారధి కేసులో తవ్వేకొద్ది వెలుగులోకి వస్తున్న పాపాల పుట్ట..!