Aryan khan: ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో మరో కీలక మలుపు.. బెయిల్‌ కోసం డబ్బులు డిమాండ్ చేశాడంటూ..

Aryan khan: షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. మొన్నటి వరకు..

Aryan khan: ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో మరో కీలక మలుపు.. బెయిల్‌ కోసం డబ్బులు డిమాండ్ చేశాడంటూ..
Aryan Khan

Updated on: Nov 05, 2021 | 7:45 PM

Sameer wankhede: షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆర్యన్ ఖాన్‌ జైళ్లో ఉన్న సమయంలో బెయిల్ కోసం పోలీసు అధికారి వాంఖెడే డబ్బులు డిమాండ్ చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఆరోపణలు సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు వాంఖెడేను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాంఖెడే స్థానంలో విచారణాధికారిగా సంజయ్‌సింగ్‌ను నియమించారు. ఇక విచారణాధికారి స్థానం నుంచి తొలగించిన వాంఖెడేను ఎన్సీబీ సెంట్రల్‌ జోన్‌కు బదిలీ చేశారు. దీంతో ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ విచారణ నుంచి వాంఖెడే దూరం జరగనున్నారు.

ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల లోపు హాజరుకావాల్సి ఉండటంతో ఆర్యన్ కార్యాలయానికి చేరుకున్నాడు. కండిషన్ బెయిల్ నేపథ్యంలో అతను మరోసారి కార్యాలయానికి రావాల్సి వచ్చింది. కింగ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తీసుకుంటూ.. అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. ఎన్సీబీ విచార‌ణ అనంత‌రం అక్టోబ‌ర్ 8న అతన్ని ఆర్ధర్ రోడ్ జైలుకు తరలించారు. ఆ త‌ర్వాత ఎన్సీబీ స్పెష‌ల్ కోర్టు, కింది కోర్టుల‌లో ఆర్యన్ ఖాన్ తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిష‌న్‌లు వేయ‌గా కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి.

 

Also Read: Puneeth Raj Kumar: తండ్రిని కలిసిన పునీత్.. కన్నీరు పెట్టిస్తున్న అందమైన పెయింటింగ్..

Raja Vikramarka: ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజా విక్రమార్క.. రేపే అసలైన స్పెషల్… అదేంటంటే..

Raja Vikramarka: ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజా విక్రమార్క.. రేపే అసలైన స్పెషల్… అదేంటంటే..