Athiya Shetty- KL Rahul: కేఎల్ రాహుల్- అతియాల గొప్ప మనసు.. వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతోన్న పిల్లల కోసం..

|

Aug 03, 2024 | 7:18 PM

బాలీవుడ్ లో ఉన్న ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అతియా శెట్టి- కేఎల్ రాహుల్‌ల జోడీ ఒకటి. పెళ్లికి ముందు చాలా రోజుల పాటు ప్రేమలో గడిపిన ఈ జంట 2023, జనవరి 23న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది అతియా శెట్టి. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయారు

Athiya Shetty- KL Rahul:  కేఎల్ రాహుల్- అతియాల గొప్ప మనసు.. వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతోన్న పిల్లల కోసం..
Athiya Shetty, Kl Rahul
Follow us on

బాలీవుడ్ లో ఉన్న ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అతియా శెట్టి- కేఎల్ రాహుల్‌ల జోడీ ఒకటి. పెళ్లికి ముందు చాలా రోజుల పాటు ప్రేమలో గడిపిన ఈ జంట 2023, జనవరి 23న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది అతియా శెట్టి. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా తన భర్తతో కలిసి ఓ ఛారిటీ సంస్థను నెలకొల్పింది అతియా శెట్టి. విప్లా ఫౌండేషన్ కోసం నిధులు, విరాళాలను సేకరించేందుకు ‘క్రికెట్ ఫర్ ఎ కాజ్’ పేరుతో ఒక ఛారిటీని ప్రకటించారీ క్యూట్ కపుల్. ముంబయిలో సేవ్ ది చిల్డ్రన్ ఇండియాగా పిలువబడే సంస్థను ఆ తర్వాత విప్లా ఫౌండేషన్‌గా మార్చారు. ఇప్పుడీ సంస్థ కోసమే మరికొందరు క్రికెటర్లతో కలిసి ఛారిటీ తరఫున నిధులు సేకరించనున్నారు అతియా- కేఎల్ రాహుల్. ఇందుకోసం ప్రత్యేకంగా వేలం పాటలు నిర్వహించనున్నారు. ఈ నిధులను వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థుల కోసం వినియోగించనున్నారు.

ఈ వేలంలో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, జస్​ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, రాహుల్ ద్రవిడ్ తదితర క్రికెటర్లు భాగం కానన్నారు. ఈ వేలంలో పాల్గొని తమకు నచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. దీనిని దివ్యాంగుల పిల్లల ఆలనా పాలనా చూసుకుంటోన్న విప్లా ఫౌండేషన్‌ ​కు అందించనున్నారు రాహుల్-అతియా.

ఇవి కూడా చదవండి

భారత క్రికెటర్లతో కలిసి..

కేఎల్ రాహుల్- అతియా శెట్టి నిర్వహించనున్న ఈ ఛారిటీ వేలంలో భారత క్రికెటర్లతో పాటు జాస్ బట్లర్, క్వింటన్ డికాక్, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్ లాంటి విదేశీ స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. దీని గురించి తెలిసిన అభిమానులు, నెటిజన్లు రాహుల్- అతియాల సేవా గుణాన్ని మెచ్చుకుంటున్నారు. పిల్లల కోసం చాలా గొప్ప పని చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కేఎల్ రాహుల్, అతియా శెట్టిల  లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.