Kangana trolls Gehraiyaan: కంగనా రనౌత్.. కేరాఫ్ కాంట్రవర్సీ. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేస్తూ ఉంటుంది. ఆమె సోషల్ మీడియా వేదికగా పెట్టే పోస్టులు.. చాలా వివాదాస్పదంగా ఉంటాయి. కొన్నిసార్లు ఉద్రిక్తతలు కూడా చెలరేగేలా చేస్తాయి. ఎప్పుడూ ఏదో ఓ విషయమై కంగనా వార్తల్లో ఉంటుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video)లో రిలీజైన ‘గెహ్రాహియా’ సినిమాపైనా పరోక్షంగా స్పందించిన కంగన.. సంచలన కామెంట్స్ చేసింది. మూవీలో లీడ్ రోల్ చేసిన దీపిక పదుకునే(Deepika Padukone)పై సెటైర్లు వేసింది. స్కిన్‌షో-అశ్లీలత ఏ సినిమాను సేవ్ చేయలేవంటూ రాసుకొచ్చింది. తాను ఈ జనరేషన్‌కు చెందిన మనిషినే అని… కానీ ఇలాంటి రొమాన్స్‌ను అర్థం చేసుకోగలను అని పేర్కొంది. న్యూ ఏజ్ సినిమా పేరుతో అలాంటి చెత్త మూవీస్ రిలీజ్ చెయ్యకండి అని పేర్కొంది. “బ్యాడ్ మూవీస్ ఎప్పుడు బ్యాడ్ మూవీసే. స్కిన్‌షో, రొమాన్స్ వాటిని ఏ మాత్రం సేవ్ చేయలేవు. ఇది చాలామందికి తెలిసిన విషయం” అని కంగన తన ఇన్‌స్టా స్టోరీలో సుదీర్ఘంగా రాసుకొచ్చింది. ప్రస్తుతం కంగనా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ప్రేమ, ఫ్రెండ్షిప్, వ్యక్తిగత సంబంధాలు.. వాటి పరిణామాల చుట్టూ ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ షకున్ బత్రా. దీపికా పదుకునే- సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా కీలక పాత్రల్లో నటించారు. అలిషా, జైన్ అనే జంట ప్రయాణమే ‘గెహ్రాహియా’ కథ. ఈ మూవీకి సుమిత్ రాయ్ కథ అందించగా.. కరణ్ జోహర్ ప్రొడక్షన్ హౌస్ ధర్మా ప్రొడక్షన్స్ హౌస్ నిర్మించింది. ఈ మూవీలో దీపికా నటనకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి.
Also Read: ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు.. ఎందులో స్పెషలిస్టో తెలిస్తే.. బుర్ర బ్లాంక్ అవ్వడం ఖాయం