Hrithik Roshan: విజువల్ వండర్ గా రానున్న హృతిక్ రోషన్ క్రిష్ 4.. స్టోరీ ఇదే అంటూ చక్కర్లు కొడుతున్న వార్త..

బాలీవుడ్‏లో సంచలనం సృష్టించిన సినిమాల్లో క్రిష్ ఒకటి. స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో బాలీవుడ్‏లో సంచలన రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Hrithik Roshan: విజువల్ వండర్ గా రానున్న హృతిక్ రోషన్ క్రిష్ 4.. స్టోరీ ఇదే అంటూ చక్కర్లు కొడుతున్న వార్త..
Hrithik Roshan

Updated on: Jun 27, 2021 | 10:44 AM

Hrithik Roshan:

బాలీవుడ్‏లో సంచలనం సృష్టించిన సినిమాల్లో క్రిష్ ఒకటి. స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో బాలీవుడ్‏లో సంచలన రికార్డ్స్ క్రియేట్ చేసింది. రాకేష్ రోహన్ దర్శకత్వంలో వచ్చిన క్రిష్ సినిమా కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో హాలీవుడ్ తరహాలో క్రిష్ కు వరుసగా ప్రాంచైజీ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన క్రిష్ సీక్వెల్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ నుంచి రానున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో క్రిష్ 4 ఒకటి. మొదటి మూడు సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ దక్కిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. క్రిష్ నాలుగో పార్ట్ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.. షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని దర్శకుడు రాకేష్ రోహాన్ చెప్పిన కొన్నాళ్లకే కరోనా వల్ల మొత్తం ప్రాజెక్ట్ అటకెక్కింది. ఎట్టకేలకు మళ్లీ క్రిష్ 4 కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

క్రిష్ మొదటి పార్ట్ లో జాదూ క్యారెక్టర్ చాలా కీలకంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్లీ జాదూ ను చూసిందే లేదు. మళ్లీ నాల్గవ పార్ట్ లో జాదూ క్యారెక్టర్ ను చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. హీరో తయారు చేసిన ఒక మెషన్ తో భవిష్యత్తు కాలానికి వెళ్లడంతో పాటు గడచిపోయిన కాలం లోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుందట. ఆ మిషన్ ను దక్కించుకునేందుకు విలన్స్ చేసే ప్రయత్నం.. దాన్ని క్రిష్ ఎలా తిప్పి కొట్టాడు అనేది సినిమా కథగా చెబుతున్నారు. విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాకేష్ రోషన్ చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anu Emmanuel: అను బేబీ ప్రేమలో పడిందా..? నెటిజన్లల్లో అనుమానులు రేకెత్తిస్తున్న అమ్మడి ఫోటోలు..

Nandini Rai Dance: పోసాని శవం దగ్గర ధనుష్ సాంగ్ కు ఓ రేంజ్ లో చిందేసిన నందిని రాయ్.. వీడియో వైరల్

khiladi : తుది దశకు చేరుకున్న మాస్ మహారాజా మూవీ షూటింగ్… దుబాయ్ కు పయనంకానున్న ఖిలాడి టీమ్

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us