Gul Panag Responds: నేటి యువత మోకాళ్ళ వద్ద చిరిగిన జీన్స్‌తో దర్శనమిస్తోందని, ఇది మన సంస్కృతికి చిహ్నమా అని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. డెహ్రాడూన్ లో బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఉత్తరాఖండ్ స్టేట్ కమిషన్ నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒక స్వచ్చంద సంస్థను (ఎన్జీఓ) ను నిర్వహిస్తున్న మహిళ చిరిగిన జీన్స్ ధరించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మోకాళ్ళను నగ్నంగా చూపడంపట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసలు ఇది మన కల్చర్ కాదని, విదేశాల్లో వారు ఓ వైపు మన దేశపు యోగా, పూర్తి వస్త్ర ధారణ చేస్తుంటే మరో వైపు మనం నగ్నత్వం వైపు పరుగులు పెడుతున్నామని ఆయన విచారం వ్యక్తం చేశారు.
కాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన్ను ప్రశ్నిస్తూ కౌంటర్ ఇస్తున్నారు. ఇక అప్పటి నుంచి ట్విట్టర్లో # రిప్డ్ జీన్స్ ట్విట్టర్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తాజాగా బాలీవుడ్ నటి గుల్ పనాగ్ కూడా స్పందించారు. చిరిగిన జీన్స్ మరియు పసుపు టీ షర్టులో ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు, చిన్న అమ్మాయి కూడా ఆమెతో నిలబడి ఉంది. ఆమె ట్వీట్‌కు # రిప్డ్ జీన్స్ ట్విట్టర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను తన క్యాప్షన్‌గా జోడించింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఎంపీ ప్రియాంకా చతుర్వేది, కాంగ్రెస్ నేతలు, సినీ ప్రముఖులు సైతం మండిపడుతున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనువరాలు నవ్య నవేలి నందా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. టోన్డ్ జీన్స్ ధరించిన ఓ ఫొటోని ఇన్‌స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన నవ్య అలాంటి దుస్తులు వేసుకోవడాన్ని తాను గర్వంగానే ఫీల్ అవుతానని తెలిపారు. తమ వస్త్రధారణ కంటే..ముందు మీ అభిప్రాయాలు, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు. అయితే..తర్వాత..ఆ పోస్టును డిలీట్ చేశారు.
#RippedJeansTwitter pic.twitter.com/zwitZiIE9k
— Gul Panag (@GulPanag) March 17, 2021