Kareena Kapoor: ట్రెండ్‌అవుతున్న బాయ్ కట్ కరీనా ఖన్ .. నీకు సీత పాత్రకాదు కాదు శూర్పణక బాగుంటుందని కామెంట్స్

|

Jun 12, 2021 | 5:53 PM

Kareena Kapoor: ఒకప్పుడు సినిమాలకు అనుగుణంగా దర్శకనిర్మాతలు బ్యానర్ ను బట్టి హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ ను తీసుకునేవారు. ఒకొక్కసారి పాత్ర..

Kareena Kapoor: ట్రెండ్‌అవుతున్న బాయ్ కట్ కరీనా ఖన్ .. నీకు సీత పాత్రకాదు కాదు శూర్పణక బాగుంటుందని కామెంట్స్
Karina Kapur
Follow us on

Kareena Kapoor: ఒకప్పుడు సినిమాలకు అనుగుణంగా దర్శకనిర్మాతలు బ్యానర్ ను బట్టి హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ ను తీసుకునేవారు. ఒకొక్కసారి పాత్ర నచ్చితే డబ్బులతో పనిలేకుండా సినిమాలు చేశారు అని పాత తరం నటీనటులు అప్పటి రోజులను గుర్తు చేసుకుంటారు. కాలక్రమంలో అన్ని మారినట్లు సినీ పరిశ్రమలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పడు హీరో, హీరోయిన్లు రెమ్యునరేషన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్పగా గర్వంగా ఫీలవుతున్నారు అభిమానులు. అయితే ప్రస్తుతం కరీనాకు భారీ రెమ్యునరేషన్ అన్న వార్తలు వ్యతిరేకంగా మారాయి. ఆమె డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్‌ ను వ్యతిరేకిస్తున్నారు.. ఛీ అంటున్నారు. సీత మీద తీయబోయే సినిమాలో లీడ్‌ రోల్‌ కోసం కరీనా నిర్మాతలను భారీగా డిమాండ్‌ చేసిందన్న పుకార్లు బీ టౌన్ లో షికారు చేశాయి. ఈ నేపథ్యంలో కొందరు పనిగట్టుకుని #BoycottKareenaKhan ను సోషల్ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.

కరీనా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని.. ఆమె చేస్తున్న పని ఒక మాయని మచ్చ అని వెరైటీగా #BoycottKareenaKhan హ్యాష్‌ట్యాగ్‌తో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్యాగ్‌ శనివారం ఉదయం నుంచి ట్విట్టర్‌లో ట్రెండ్‌ నడుస్తోంది. అయితే బాయ్ కట్ కరీనాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సీత పాత్రకు కరీనా కంటే కంగనా బెస్ట్ అంటున్నారు. మరికొందరు సీత సినిమాలో సీత క్యారెక్టర్ కంటే.. శూర్పణఖ క్యారెక్టర్ అంటూ సెటైర్స్ చేస్తున్నారు.

భార్య భర్తలు ఇద్దరూ హిందువుల మనోభావాలను హార్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని.. అప్పట్లో తాండవ్‌తో ఆమె భర్త సైఫ్‌, ఇప్పుడు కరీనా ఖాన్‌ హిందువుల్ని హర్ట్‌ చేశారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వివాదానికి కారణమైన సీత నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు అలౌకిక్‌ దేశాయ్‌ దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ కథ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్టోరీ అందించనున్నారని సమాచారం.

Also Read:  పడిలేచిన కెరటం తండ్రికి తనయుడు మ్యాచో స్టార్ గోపీచంద్‌ పుట్టిన రోజు నేడు..

అనేక రహస్యాలు నెలవు ఈ శివాలయం తల్లికోసం పాండవులు ఒక్కరాత్రిలో నిర్మించినట్లు పురాణాల కథనం