Taapsee Pannu: తాప్సీ పెళ్లి కండిషన్లు విన్నారా ? అబ్బాయి ఎలా ఉండాలో చెప్పిన హీరోయిన్..

"ఝమ్మంది నాధం" సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ పన్నూ. తన నటనతో ఎంతో మంది అభిమానులను

Taapsee Pannu: తాప్సీ పెళ్లి కండిషన్లు విన్నారా ? అబ్బాయి ఎలా ఉండాలో చెప్పిన హీరోయిన్..
Taapsee Pannu

Updated on: Jul 09, 2021 | 12:42 PM

“ఝమ్మంది నాధం” సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ పన్నూ. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా… తక్కువ కాలంలో వరుస సినిమాలు చేస్తూ.. టాప్ ప్లేస్‏లో కొనసాగింది. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్‏కు షిఫ్ట్ అయిన తాప్సీ.. అక్కడ వరుస ఆఫర్లను అందుకుంటూ కెరీర్‏ను ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. చాలా కాలంగా తాప్సీ తెలుగులో సినిమాలు చేయడం లేదు. బాలీవుడ్ రెబల్ క్వీన్‏గా పాపులరైన తాప్సీ తన పెళ్లి గురించి.. కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తన తల్లిదండ్రులకు కూడా నచ్చాలని… అలాగే వారితో అతను కలిసిపోయినట్లుగా ఉండాలని.. అలాంటి వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తాను డేటిన చేసిన ప్రతి వ్యక్తితో ఈ విషయాన్ని క్లియర్‏గా చెప్పానని తెలిపింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తను.. రిలేషన్‏షిప్ కోసం సమయాన్ని కేటాయిస్తానని.. అనవసరంగా టైమ్ పాస్ చేయనని చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి విషయంలో తల్లిదండ్రులు సందేహాలున్నాయని.. పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోతానని తన పేరెంట్స్ భయపడుతున్నట్లుగా చెప్పింది.

తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. నేను ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తుంటే టైమ్ ఉండదు. కేవలం రెండు సినిమాలతో సరిపెట్టుకునే స్థాయికి వస్తే అప్పుడే నా వ్యక్తిగత జీవితాని సమయం కేటాయిస్తాను అని తెలిపింది. తాప్సీ ప్రస్తుతం మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ కోచ్ మాథ్యూస్ బోతో డేటింగ్‏లో ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి గురించి గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Also Read: Viral Video: అడ్డుగా ఉందని తలైవి స్టైల్‏లో తన్నాడు.. అడ్డంగా పడ్డాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Stress Relief: నిత్యం ఒత్తిడితో సతమతమవుతున్నారా..? అయితే ఈ పద్దతులు పాటించండి..

Rajini Kanth: చెన్నై చేరుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్.. తలైవికి ఘన స్వాగతం పలికిన అభిమానులు..

Loading...
Unable to load recommendations.
Follow Us