పర్ఫెక్ట్ బాడీని మెయింటెన్ చేయడంతో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తర్వాతే ఎవరైనా! ఫిట్నెస్ విషయంలో హృతిక్ కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు. అందుకే 48 ఏళ్ల వయసులో కూడా 8 ప్యాక్ బాడీని మెయింటెన్ చేస్తున్నాడు. తాజాగా హృతిక్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చెమటలు పట్టిస్తున్నాయి. హృతిక్ ట్విటర్లో పోస్టు చేసిన తాజా ట్వీట్లో ‘ఆల్రైట్ లెట్స్ గో’ అనే క్యాప్షన్‌తో #2023 హ్యష్‌ట్యాగ్‌ను జోడించారు.
ఇక హృతిక్ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘యూ ఆద్ ది బెస్ట్, ఇదిగో నిజమైన ఫైటర్ వచ్చాడు, 48 ఏళ్ళ వయసులో బోహోట్ హార్డ్, మీరే మాకు ఇన్స్పిరేషన్.. ఇప్పటి నుంచి మేము కూడా డైట్ పాటిస్తామని’ అంటూ పలువురు కామెంట్ సెక్షన్లో సరదాగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. యాభైకి చేరువవుతున్నా ఏమాత్రం తగ్గని క్రేజ్ సొంతం చేసుకుంటున్నాడు ఈ బాలీవుడ్ నటుడు. క్రిష్ 3, బ్యాంగ్ బ్యాంగ్, వార్, విక్రమ్ వేద వంటి సినిమాల్లో యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో హృతిక్ రోషన్ అలరించారు.
Alright. Let’s go.
#2023 pic.twitter.com/gM62h8r5l1
— Hrithik Roshan (@iHrithik) January 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.