Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దాడి చేసింది ఎవరంటే?

ముంబైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బాలీవుడ్‌ నటుడు టైగర్ ష్రాఫ్‌ కారుపై కాల్పులు జరిగాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి సుమారు 5 రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాల కాగా టైగర్‌ ష్రాఫ్‌ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దాడి చేసింది ఎవరంటే?
Shots Fired At Tiger Shroffs Convoy In Mumbai

Updated on: Oct 18, 2026 | 8:46 PM

ముంబైలోని జుహులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బాలీవుడ్ స్టార్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగాయి. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా నటుడి కారుపై కాల్పులకు తెగబడ్డారు. జుహులోని జేవీపీడీ గ్రౌండ్ సమీపంలో నటుడి కారు వెళ్తుండగా, అటుగా వచ్చిన ఆ దుండగులు దాదాపు ఐదు నుంచి ఏడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.

ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ డ్రైవర్‌తో పాటు ఒక రిక్షా డ్రైవర్ గాయపడినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో టైగర్ ష్రాఫ్ కూడా కారులోనే ఉన్నప్పటికీ, ఆయన పూర్తిగా క్షేమంగా బయటపడటం ఊరటనిచ్చే అంశం. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై ముంబై పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. జుహు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కాల్పుల ఘటన జరిగిందని, టైగర్ ష్రాఫ్ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా, ఈ కాల్పుల ఘటనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది.

మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం స్పందించారు, ఈ ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us