Bollywood: నెట్టింట పాటలు పాడుతూ ఫేమస్.. కట్ చేస్తే.. సోనూ సూద్ సినిమాలో ఛాన్స్..!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఎటువైపు నుంచి అదృష్టం తన్నుకొస్తుందో ఎవరికీ తెలియదు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అమర్‌జీత్ జైకర్‌కు కూడా ఇలానే కలలో కూడా ఊహించని అదృష్టం వచ్చి తలుపు తట్టింది. ఇటుకల బట్టీ కార్మికుడైన అమర్‌జీత్‌కు పాటలు పాడడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే అతను బాలీవుడ్ పాటలను పాడుతూ వాటిని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఉండేవారు. అయితే అతను ఇటీవలి కాలంలో ‘దిల్ దే దియా హై’ పాట పాడి ఆ […]

Bollywood: నెట్టింట పాటలు పాడుతూ ఫేమస్.. కట్ చేస్తే.. సోనూ సూద్ సినిమాలో ఛాన్స్..!
Sonu Sood; Amarjeet

Updated on: Feb 25, 2023 | 10:01 AM

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఎటువైపు నుంచి అదృష్టం తన్నుకొస్తుందో ఎవరికీ తెలియదు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అమర్‌జీత్ జైకర్‌కు కూడా ఇలానే కలలో కూడా ఊహించని అదృష్టం వచ్చి తలుపు తట్టింది. ఇటుకల బట్టీ కార్మికుడైన అమర్‌జీత్‌కు పాటలు పాడడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే అతను బాలీవుడ్ పాటలను పాడుతూ వాటిని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఉండేవారు. అయితే అతను ఇటీవలి కాలంలో ‘దిల్ దే దియా హై’ పాట పాడి ఆ వీడియోను ట్విట్టర్‌లో  పోస్టు చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిని 10 లక్షల మందికిపైగా వీక్షించారు.

అయితే అనుకోకుండా ఈ వీడియోను చూసిన బాలీవుడ్ నటుడు, హెల్పింగ్ స్టార్ సోనూ సూద్, నటి నీతూ చంద్ర, ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ సహా పలువురు ప్రముఖులు అమర్‌జీత్‌ను ప్రశంసిస్తూ వీడియోను రీ ట్వీట్ చేశారు. అంతేకాదు సోనూ సూద్, నీతూచంద్ర అతడి ఫోన్ నంబరు తీసుకుని మరీ మాట్లాడారు. అంతేకాక సోనూసూద్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఫతే’ చిత్రంలో అతడికి పాడే అవకాశాన్ని కూడా కల్పించారు. బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అమర్‌జీత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోనూ సూద్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న అమర్‌జీత్ వారి ప్రేమాభిమానాలు తనకు ఇలాగే ఉండాలని కోరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us