
తెలుగు టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’. ఈ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన కంటెస్టెంట్లు తమదైన శైలిలో మరంత రసవత్తరంగా మారుస్తారనుకుంటే రెండు రోజులకే మిథిలేష్ వెళ్లిపోగా.. చివరకు అరుస్తూ జనాలకు తెగ విసుగుపుట్టించింది అపూర్వ. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నట్లు ఇదివరకు నాగార్జున వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు హౌస్ లో ఎలిమినేషన్ జరిగింది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఎలిమినేట్ ఎవరనే విషయాన్ని బయటపెట్టారు. ఈవారం మొత్తం ఆరుగురు నామినేట్ కాగా.. చివరకు చరణ్, అపూర్వ డేంజర్ జోన్ వరకు వెళ్లారు. చివరగా అపూర్వ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగార్జున. ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకు వచ్చిన అపూర్వ.. నాగార్జున ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యింది. అనంతరం హౌస్‌లో ఉన్న కొందరు సభ్యుల తీరుపై తన అసంతృప్తిని కుండబద్దలు కొట్టింది.
ఎక్కువమంది చదివినవి: Bathukamma Song : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ కొత్త బతుకమ్మ పాట.. గంటల్లోనే
ముఖ్యంగా రోహిత్ గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుతూ.. ఆయన పక్కన ఉన్న వాళ్లను లుక్ డౌన్ చేస్తారని, తక్కువ చేసి మాట్లాడినప్పుడు చాలా హర్టింగ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రోహిత్ నేచర్ కొంచెం సెల్ఫిష్‌గా ఉంటుందని, ఎవరికో మంచి చేయాలని చూస్తూ ఇంకెవరికో చెడు చేస్తారంటూ సూటిగా ఇచ్చిపడేసింది. మరోవైపు షాలిని ఆటతీరును ప్రస్తావిస్తూ.. ఎవరైనా ఛాన్స్ ఇస్తేనే ముందుకు వస్తావని, నీ ఛాన్స్ కోసం నువ్వు గట్టిగా ఫైట్ చేసి దిగాలని కౌంటరిచ్చింది.
ఎక్కువమంది చదివినవి: Jaya Prada: ఆ హీరోకు అత్తగా నటించా.. అతడు అంటే నాకు పిచ్చి ఇష్టం.. జయప్రద..
అయితే అపూర్వ మూడో వారంలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఆమెతో పాటు మిథిలేష్ కూడా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన రూ.15 లక్షల సూట్ కేస్ ఆఫర్ ను స్వీకరించి మిథిలేష్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అపూర్వ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని గేమ్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించింది. కానీ ప్రతిసారి చిన్న చిన్న విషయాలకే అరవడం, గొడవలు పెట్టుకోవడంతో ఆమెకు ఓటింగ్ తగ్గినట్లు తెలుస్తోంది. అయితే అగ్ని పరీక్ష సీజన్ 2 ద్వారా కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన అపూర్వ.. వారానికి రూ. 75 వేల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఆ లెక్కన చూస్తే మూడు వారాలకు ఆమె దాదాపు రూ.2.25 లక్షల వరకు పారితోషికం దక్కి ఉండొచ్చని తెలుస్తోంది.
ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..
ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..