రూటు మార్చిన ప్రభాస్ హీరోయిన్.. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్ వైపు అడుగులు వేస్తున్న స్వీటీ..

|

Feb 02, 2021 | 8:25 PM

తెలుగులోకి సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్‏గా ఎదిగింది అనుష్క. అటు టాప్ హీరోయిన్‏గా కొనసాగుతూనే లేడీ

రూటు మార్చిన ప్రభాస్ హీరోయిన్.. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్ వైపు అడుగులు వేస్తున్న స్వీటీ..
Follow us on

Actress Anushka Shetty: తెలుగులోకి సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్‏గా ఎదిగింది అనుష్క. అటు టాప్ హీరోయిన్‏గా కొనసాగుతూనే లేడీ ఒరియెంటేడ్ సినిమాలు కూడా చేస్తూ మంచి గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక బాహుబలి మూవీ తర్వాత అనుష్క నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇటీవల ‘నిశ్శబ్ధం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క. కానీ ఆ మూవీ ఆశించినంతగా హిట్ కాలేకపోయింది. దీంతో అనుష్క రూటు మార్చినట్లుగా సమాచారం.

తాజా సమాచారం ప్రకారం అనుష్క మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. అది కూడా ఫ్యామిలీ ఎమోషనల్ నేపథ్యంలో ఉండనున్నట్లుగా తెలుస్తోందని. ఇప్పటివరకు ఎక్కువగా లేడీ ఒరియేంటెండ్ సినిమాలకు ప్రాముఖ్యతనిచ్చిన అనుష్క.. ఈసారి రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెలువడనున్నాయి. మరీ ఈ మూవీతో స్వీటీ మళ్లీ ఫాంలోకి రానుందా ? లేదా? అనేది చూడాలి.

Also Read:

సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఈషారెబ్బా.. భారీ ప్రాజెక్టులో కీలక పాత్రలో నటించనున్న తెలుగమ్మాయి..

Adipurush Movie: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్‏కు తప్పిన పెను ముప్పు..