Rashmi Gautham: ఇలాంటి ప్రపంచంలో ఉండాలని లేదు.. డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..

ప్రవర్తన సరిగ్గా లేదని ఉద్యోగం నుంచి తీసేసారన్న కోపంతో అభం శుభం తెలియని 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా చంపేశాడు ఓ దుర్మార్గుడు. హైదరాబాద్ లోని బొల్లారంలో జరిగిన ఈ ఘటన అందరి హృదయాలను కలిచివేస్తుంది. కేవలం ఉద్యోగం పోయిందన్న కోపం.. డబ్బు కోసమే చిన్నారిని కిడ్నాప్ చేసి ప్రాణం తీసిన ఘటనపై స్థానికులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై యాంకర్ రష్మీ గౌతమ్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Rashmi Gautham: ఇలాంటి ప్రపంచంలో ఉండాలని లేదు.. డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
Rashmi Gautham

Updated on: Oct 12, 2026 | 4:48 PM

హైదరాబాద్ లోని బొల్లారంలోని ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన ఇప్పుడు అందరినీ తీవ్రంగా కలచివేస్తుంది. ఉద్యోగం నుంచి తీసేశారనన్న కోపంతోపాటు డబ్బు కోసం చిన్నారిని అపహరించి ప్రాణాలు తీశాడు ఓ దుర్మార్గుడు. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిని అపహరించి హత్య చేసిన ప్రధాన నిందితుడు సెక్యూరిటీ గార్డు విక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక ఆధారాలంతో నిందితుడిని పోలీసులు గుర్తించారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బొల్లారం పోలీస్ స్టేషన్ ముందు స్థానికులు, చిన్నారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్నారి కిడ్నాప్, హత్య ఘటనపై యాంకర్, నటి రష్మీ గౌతమ్ స్పందిస్తూ ఈ ఘటన తన మనసును తీవ్రంగా కలచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తన ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.

ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..

“గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఐదేళ్ల చిన్నారిని కిడ్పాన్ చేసి దారుణంగా హత్య చేశారు. అదీ కూడా కేవలం డబ్బు కోసం. దీని గురించి ఆలోచిస్తే రాత్రంతా నిద్రపట్టలేదు. మనం ఎక్కడికి వెళ్తున్నాం ? తప్పు ఎక్కడ జరుగుతుంది ?. ఇవన్నీ చూస్తుంటే చిన్నారులు, మూగజీవాలకు రక్షణ లేని ప్రపంచంలోనే ఉండాల్సిన అవసరం లేదనిపిస్తోంది. వారిని రక్షించాల్సిన కనీస బాధ్యత మనపై లేదా ?. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మనుషులు ఎందుకు ఇంతగా దిగజారి ప్రవర్తిస్తున్నారు” అంటూ తన ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేసింది రష్మి. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ కగా.. చిన్నారుల భద్రతపై నెటిజన్స్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

ఇదిలా ఉంటే.. చిన్నారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సెక్యూరిటీ గార్డు విక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు కోసం చిన్నారిని అపహరించి హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చిన ఈ ఘట స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..

రష్మీ గౌతమ్ ట్వీట్..

ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?

Loading...
Unable to load recommendations.
Follow Us