
RRR Movie News: ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ తిరిగి ప్రారంభం కాగా.. ఆర్ఆర్ఆర్ నుంచి టీమ్ ఓ పోస్టర్ని విడుదల చేసింది. అందులో ఇద్దరు హీరోల చేతులు కలిపినట్లుగా చూపించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ గురించి ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ఈ పోస్టర్ని చూస్తుంటే కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు ఇద్దరు కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాడుతారని తెలుస్తోంది అని ట్వీట్ చేశారు.
దానికి ఆర్ఆర్ఆర్ టీమ్ స్పందించింది. ఆ ఇద్దరు కలుస్తారు. అవి వారి చేతులే. కానీ ఈ మూవీలో వారిద్దరు స్వాతంత్ర్యం కోసం పోరాడరు. ఇది దేశభక్తి చిత్రం కాదు. కేవలం కల్పిత కథ మాత్రమే అని కామెంట్ పెట్టారు. కాగా గత ఏడాది ఈ మూవీ గురించి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో సైతం రాజమౌళి సినిమా కథను వివరించారు. ”అల్లూరి సీతారామరాజు కొన్ని రోజులు ఇంటి నుంచి దూరంగా వెళ్లారు. కొమరం భీమ్ కూడా కొన్ని రోజులు ఇంటి నుంచి వెళ్లారు. అప్పుడు వారు ఎక్కడికి వెళ్లారన్నది ఎవ్వరికీ తెలీదు. మళ్లీ ఇంటికి తిరిగి వచ్చిన తరువాత వారిద్దరు ఆలోచన విధానాలు ఒకటే విధంగా ఉండేవి అని తెలుసుకున్నా. అప్పుడే ఆర్ఆర్ఆర్ ఐడియా వచ్చింది. ఇది ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతుంది అని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే.
కాగా ఈ మూవీలో చెర్రీ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా నటించనున్నారు. అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Read More:
‘పుష్ప’ కోసం రాజమండ్రి ఫిక్స్..!
పర్యావరణ రక్షణ కోసం బ్రిటన్ ప్రిన్స్ ముందడుగు.. ‘ఎర్త్‌షాట్’ ప్రైజ్ ఆవిష్కరణ