రానా ప్లేస్‌లోకి అల్లు అర్జున్‌!

2015లో రుద్రమదేవి మూవీ విడుదల తరువాత తన తదుపరి ప్రాజెక్ట్‌గా హిరణ్యకశ్యపను దర్శకుడు గుణశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే

రానా ప్లేస్‌లోకి అల్లు అర్జున్‌!

Edited By:

Updated on: Aug 24, 2020 | 1:11 PM

Gunasekhar Hiranyakashyap movie: 2015లో రుద్రమదేవి మూవీ విడుదల తరువాత తన తదుపరి ప్రాజెక్ట్‌గా హిరణ్యకశ్యపను దర్శకుడు గుణశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రానా దగ్గుబాటి నటించబోతున్నట్లు గుణశేఖర్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. అయితే ఐదు సంవత్సరాలు అవుతున్నా.. ఈ ప్రాజెక్ట్‌ ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. మొదట్లో రానా వరుస సినిమాలతో బిజీగా ఉండటం, ఆ తరువాత అనారోగ్యంతో అతడు కొన్ని రోజులు షూటింగ్‌కి దూరంగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌ వాయిదా పడుతూ వస్తోంది.

అయితే మరోవైపు స్క్రిప్ట్‌ను రెడీగా చేసుకున్న గుణశేఖర్‌, త్వరలోనే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ని సంప్రదించాలని ఆయన భావిస్తున్నారట. బన్నీతో గుణశేఖర్‌కి మంచి సాన్నిహిత్యం ఉండగా అతడు ఒప్పుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’లో నటించనున్న అల్లు అర్జున్‌, ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే.

Read More:

నీ మూతి పగలగొడతా: జర్నలిస్ట్‌పై బ్రెజిల్ అధ్యక్షుడు ఫైర్‌

ప్రభాస్-నాగ్‌ అశ్విన్‌ మూవీలో ఇస్మార్ట్ బ్యూటీ!