
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. కొన్నాళ్లుగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో హీరోయిన్ విద్యాబాలన్ సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర రజినీకాంత్ కు ధీటుగా నిలబడే రోల్ అని.. దీంతో తాను ఈ పాత్ర చేయడానికి ముందుగా సందేహాపడ్డానని అన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో సిగరేట్ సీన్ చేయడం తాను ఊహించిన దానికంటే ఎక్కువగా సవాలుగా మారిందని అన్నారు.
ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన సిగరేట్ సన్నివేశాన్ని మొదటి రోజే చిత్రీకరించాల్సి వచ్చిందట. అయితే రజినీకాంత్ సార్‌కు ఎదురుగా నిలబడే పాత్ర తనదని.. అలాంటి బలమైన పాత్ర పోషించడానికి తాను భయపడ్డానని అన్నారు. ముఖ్యంగా సిగరెట్ కాల్చి, ఆ పొగను రజనీకాంత్ సార్ ముఖం మీదకు ఊదమని డైరెక్టర్ తనకు చెప్పినప్పుడు తాను భయంతో వణికిపోయానని అన్నారు. ఈ ఒక్క సీన్ చేయడానికి తాను ఎంతో ఇబ్బంది పడ్డానని… ఏకంగా మూడు టేకులు తీసుకున్నానని అన్నారు. ఈ సీన్ చేయడానికి తాను వణికిపోతున్నప్పుడు మానిటర్ పై అందరూ గమనించారని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
ఇక ఇదే విషయాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సైతం వెల్లడించారు. “మేము ఆ షాట్ తీస్తున్నప్పుడు, నేను మానిటర్ వైపు చూశాను. మేడమ్ సిగరెట్ పట్టుకుని, లిప్‌స్టిక్ రాసుకుంటున్నట్లుగా చేతిని ఊపుతున్నారు. ఆ క్షణంలో, ఇది సరిగ్గా కుదరదని నేను అనుకున్నాను. సుమారుగా మూడో టేక్‌లో మాత్రమే మేము దానిని సరిగ్గా తీయగలిగాము. ఇప్పటికీ, మీరు ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు, మేడమ్ కళ్లలో కొద్దిగా ఉద్రిక్తత కనిపిస్తుంది,” అని నెల్సన్ అన్నారు. మొదట్లో కాస్త కంగారుపడినప్పటికీ, కొన్ని టేకుల తర్వాత టీమ్ ఆ షాట్‌ను సరిగ్గా చిత్రీకరించగలిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ సీన్ ట్రైలర్ లో కూడా కనిపించింది. జైలర్ 2 అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల కానుంది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
Get addicted to the sound of #Shaitaan 🌟
🎵 https://t.co/Xm2tMPtoyc
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vidya_balan @iam_SJSuryah #MithunChakraborty #SurajVenjaramoodu @meramyakrishnan @iYogiBabu @mirnaaofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk @sunilreddy22 #PallaviSingh @valentino_suren @Alagiakoothan #SantoshRaju @kabilanchelliah @kuchirayar73 @RIAZtheboss #Jailer2FromOct15
— Sun Pictures (@sunpictures) October 10, 2026
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..